టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండేళ్ల క్రితం వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తరువాత తన సినిమా కెరీర్ కి కొంత గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయ్యారు. ఇక ఇటీవల మళ్ళి సినిమాల్లోకి వకీల్ సాబ్ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్న పవన్, ఆపై మరొక రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టారు. మెగాస్టార్ సోదరుడిగా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్, తొలి సినిమా నుండి, ఇప్పటివరకు ఎన్నో గొప్ప విజయాలు, ఎందరో అభిమానులను సంపాదించుకోవడంతో పాటు మంచి మనసున్న గొప్ప వ్యక్తిగా ఎందరితోనో కీర్తింపబడుతున్నారు. 

IHG

తన సినీ లైఫ్ లో ఇప్పటివరకు పలు సందర్భాల్లో ఎందరికో తనవంతుగా సాయపడుతూ మంచి పేరు దక్కించుకున్న పవర్ స్టార్, ఒకానొక సమయంలో తనకు చేసిన పెద్ద సాయం గురించి ఇప్పటికీ ఆయన గురువైన సత్యానంద్ పలు సందర్భాల్లో చెప్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ ముందుగా చిరంజీవి గారి ద్వారా వైజాగ్ లోని తన యాక్టింగ్ కోచింగ్ సెంటర్ లో చేరారని, మొదటి నుండి మంచి చురుకుగా వ్యవహరిస్తూ, చాలా వరకు అన్ని మెళకువలను వేగవంతంగా నేర్చుకునే అలవాటున్న పవన్, మంచితనంలోనూ ఎంతో గొప్ప వ్యక్తని సత్యానంద్ అన్నారు. ఇక అప్పట్లో ఒకానొక సందర్భంలో తన చెల్లెలి వివాహ సమయంలో తన కష్టాన్ని గ్రహించిన పవన్, వెంటనే తనకి ఫోన్ చేసి ఇంటికి పిలిపించిన అనంతరం ఒక యాభై వేల రూపాయల డబ్బు అందించారని, అప్పట్లో అది ఎంతో పెద్ద మొత్తం అని సత్యానంద్ అన్నారు. 

 

అయితే ఆదిమాత్రమే కాక, తన చెల్లి పెళ్ళికి మరికొంత డబ్బుని తనకు తెచ్చి ఇచ్చి, ఇది మీ వద్ద ఉంచండి మీ అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పారని, నిజంగా అంత మంచి వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఎవరైనా వ్యక్తి సమస్యల్లో ఉంటే పవన్ చూస్తూ ఉండలేరని, వారికి తనవంతుగా సాయం చేసి వారి సమస్యను తీర్చడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని సత్యానంద్ ఎంతో గొప్పగా పవన్ గురించి చెప్పడం జరిగింది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: