తెలుగు సినిమాలకు ఈ మధ్య కాలంలో మార్కెట్ అనేది భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. రోజు రోజు మార్కెట్ పెరుగుతుంది గాని తగ్గే పరిస్థితి అనేది ఎక్కడా కనపడటం లేదు. ప్రస్తుతం తెలుగులో కమర్షియల్ సినిమాల హవా అనేది ఎక్కువగా నడుస్తుంది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేస్తున్నారు. ఇక ప్రభాస్ బాహుబలి సినిమా కంటే ముందే కమర్షియల్ సినిమాలను ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను చేసే సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ కోణంలోనే ఉంటాయి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్ లు కూడా కమర్షియల్ సినిమాలు అయితేనే చేసే పరిస్థితి మన తెలుగులో ఉంటుంది. దీనితో వారికి సన్నిహితంగా ఉండే కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలి అని భావిస్తున్నారు. కొందరు హీరోయిన్స్ తో ఓపెనింగ్స్ వంటివి చేయించే ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా సినిమాలో పెట్టుబడి పెట్టడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపించడం గమనార్హం. ప్రస్తుతం మన తెలుగు సినిమాల్లో కమర్షియల్ హంగులతో పాటుగా... 

 

ప్రచారం కూడా ఎక్కువగా కనపడుతుంది. దీనితో ప్రచారం కోసం గానూ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తమ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తామని రాజకీయ నాయకులు చెప్తున్నట్టు సమాచారం. మన తెలుగు సినిమాలను జాతీయ స్థాయిలో ఎక్కువగా ప్రమోట్ చేస్తామని కొందరు ఎమ్మెల్యేలు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక ఎమ్మెల్యే సినిమా చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది స్పష్టంగా తెలియదు గాని ఈ సినిమాకు రంగం మాత్రం సిద్దం చేసినట్టు సమాచారం. ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది స్పష్టంగా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: