టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన హీరోల్లో అల్లరి నరేష్ ఒకరు. తన మొదటి సినిమా పేరునే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయనకు డిమాండ్ లేదు. ఆయన తో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకి వచ్చే పరిస్థితి లేదు. ఆయన సినిమాలకు ఈ మధ్య కాలంలో అంత ఆదరణ కూడా లేదు అనేది అర్ధమవుతుంది. గత రెండు మూడేళ్ళు గా ఆయన కనపడిన సినిమా అనేది ఏదీ లేదు. ప్రేక్షకుల ఆలోచన మారడం సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ కావడం తో ఆయన సినిమాలను అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

 

ఇక ఆయన మహేష్ బాబు అంటించిన మహర్షి సినిమాలో ఒక కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత అలాంటి పాత్రలకు అల్లరి నరేష్ కి డిమాండ్ పెరుగుతుంది అని భావించారు అందరూ కూడా. అయినా సరే అల్లరి నరేష్ కి మాత్రం అక్కడి నుంచి వచ్చిన డిమాండ్ ఏమీ పెద్దగా లేదు. టాలీవుడ్ లో ఇప్పుడు అతను ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అతని సినిమాల్లో ఇది వరకు ఉన్న కామెడి ఇప్పుడు లేదు. దానికి తోడు ఆయన చేసేవి అన్నీ కూడా చిన్న చిన్న సినిమాలు. 

 

అందుకే ఇప్పుడు అల్లరి నరేష్ ని పక్కన పెట్టింది టాలీవుడ్. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో అతనికి మంచి ఆఫర్ వచ్చింది అని సమాచారం. ఆ సినిమాలో ఒక కీలక పాత్రకు గానూ త్రివిక్రమ్ అతని పేరుని పరిశీలిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనం అంటున్నారు. మరి నిజమో కాదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: