గతే ఏడాది తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తన గత సినిమాల మాదిరిగా దర్శకుడు కొరటాల ఈ సినిమాలో కూడా ఒక సామజిక అంశాన్ని మంచి కమర్షియల్ హంగులు జోడించి ఆచార్యను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఆ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసారు. కాగా ఆ సినిమాకు సాహో సినిమా దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే నేడు మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ప్రత్యేకంగా వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. 

 

తన సినిమాల గురించి మెగాస్టార్ మాట్లాడుతూ, ప్రస్తుతం కొరటాలతో చేస్తున్న ఆచార్య సినిమా చాలా బాగా వస్తోందని, లాక్ డౌన్ తరువాత సినిమా మిగతా షూటింగ్ వేగవంతంగా పూర్తి చేసి, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని చెప్పిన మెగాస్టార్, ఆ సినిమా తరువాత సుజీత్ తో లూసిఫర్ రీమేక్ చేసే అవకాశం ఉందని, యువ దర్శకుడు బాబీ ఒక మంచి కథ వినిపించారని దానిపై కొంత యోచిస్తున్నట్లు చెప్పారు. మరొక యువ దర్శకుడు మెహర్ రమేష్ తో కూడా ఒక సినిమా చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఇటీవల ఒకానొక సందర్భంలో సుకుమార్, హరీష్ శంకర్, పరశురామ్ కూడా వచ్చి తనను కలిసారని, మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకులతో పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధం అని మెగాస్టార్ చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: