టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి సోమ‌వారంతో 20 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యింది. ఇక పూరి జ‌గ‌న్నాథ్‌కు స్టార్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు ఉన్న సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పూరి క్రేజ్ టాలీవుడ్‌ను దాటేసి బాలీవుడ్‌కు వెళ్ల‌డంలో వ‌ర్మ సాయం కూడా ఉంద‌నే చెప్పాలి. ఇక వ‌ర్మ హైద‌రాబాద్ ఎప్పుడు వ‌చ్చినా పూరితోనే ఉంటాడ‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక పూరి ఇంటికి కేవ్ అన్న పేరు ఉంది.

 

త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మీ ఇంటికి కేవ్ అన్న పేరు ఎందుకు ?  పెట్టార‌న్న ప్ర‌శ్న‌కు పూరి ఆ సీక్రెట్ రివీల్ చేశాడు. ఒకప్పుడు నాకు ఉన్న ఇల్లును అమ్మేశాడు. ఆ టైంలోనే పూరి ఓ చిన్న ప్లాట్‌కు మారిపోయాడు. ఆ తర్వాత డబ్బు సంపాదించి, మళ్లీ కట్టుకున్నాన‌ని.. ఆ టైంలో వ‌ర్మ త‌న కొత్త ఇంటికి వ‌చ్చాడ‌ట‌. ఈ కొత్త ఇంటికి ఏదైనా పేరు పెట్టాల‌ని పూరికి సూచించాడ‌ట‌.

 

అయితే పూరి వెంట‌నే నో మ్యాడ్‌’అని పెట్టాడ‌ట‌. శిష్యుడు పేరు న‌చ్చ‌ని వ‌ర్మ కేవ్ అని పెట్టాడ‌ట‌. కేవ్ ఎందుకు అని అడిగితే, ‘ఆల్‌ కేవ్స్‌ ఆక్యుపైడ్‌ బై టైగర్స్‌’ అన‌డంతో అది న‌చ్చి ఆ పేరునే పూరి ఉంచేశాడ‌ట‌. అది పూరి ఇంటి పేరు కేవ్ క‌థ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: