కరోనా కారణంగా దేశ ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. లాక్ డౌన్లోడ్ వాళ్ళ రవాణా  వ్యవస్థ అంతా  మూసుకు పోవడం తో రైతన్నలు పీకల లోతు  నష్టాల్లో మునిగిపోయారు. చేతికొచ్చిన పంట  చేలో నే నాశనం అవుతూ ఉంది. దీనికి తోడుగా  తుఫాన్ మరియు వర్ష బీభత్సం వలన రైతులు పండిన పంటని చేజార్చుకున్నారు. రైతులను ఆదుకోవాల్సినది గా సినీ స్టార్లు మరియు ప్రొడ్యూసర్లు మరియు డైరెక్టర్లు పిలుపునిస్తున్నారు.

 

ఇందులో భాగంగా హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ రైతు పడుతున్నా ఆవేదనను     ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అయితే ఆ రైతు పుచ్చకాయ  పంట కోసం దాదాపు ఆరు లక్షల వరకూ ఖర్చు చేశాడు.  పంట చేతి కి వచ్చింది కానీ కొనే నాధుడు లేదు. పంటను కొనేవారు కేజీకి రెండు రూపాయల చొప్పున అడుగుతున్నారు. అయితే ఆ రైతు తనను ఆదుకోవాల్సిందిగా ట్విట్టర్ లో తన నంబర్ ను మరియు  పంటలకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: