పూరి జ‌గ‌న్నాథ్ సౌత్ ఇండియా సినిమా ఇండ‌స్ట్రీలో గ‌త రెండు ద‌శాబ్దాల్లో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారితోనూ... ఇప్పుడు ఉన్న వారితోనూ ప‌నిచేశాడు. పూరి తొలి సినిమా హీరోయిన్లు బ‌ద్రిలో అమీషా ప‌టేల్‌, రేణు దేశాయ్ నుంచి మొద‌లు పెడితే కాజ‌ల్‌, త‌మ‌న్నా, ఇలియానా, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌, శ్రీయ‌, ఛార్మీ, ఆశిన్‌, అనుష్క అంద‌రితోనూ ప‌నిచేశాడు. 

 

ఈ హీరోయిన్ల విష‌యంలో పూరికి ఒక్కొక్క‌రి విష‌యంలో ఒక్కో విధ‌మైన అభిప్రాయం ఉండి ఉండొచ్చు. ఇక త‌న రెండు ద‌శాబ్దాల ప్ర‌స్థానంపై ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న హీరోయిన్లు అయిన త‌మ‌న్నా, కాజ‌ల్‌, ఇలియానా గురించి పూరి ఇలా స్పందించాడు. త‌మ‌న్నా డేడికేటెడ్ యాక్ట‌ర్ అని కితాబు ఇచ్చిన పూరి.. కాజల్ చాలా స‌ర‌దా మ‌నిషి అని చెప్పాడు. ఇక గోవా బ్యూటీ ఇలియానాను మాత్రం చాలా హాట్ హీరోయిన్ అని చెప్పాడు. అంటే పూరి మ‌న‌స్సులో ఇలియానా అంత హాట్ హీరోయిన్ అన్న‌మాట‌. ఈ గోవా బ్యూటీ పూరి పోకి సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: