దక్షిణ భారత చిత్రసీమకు చెందిన అగ్ర దర్శకుల జాబితాలో తమిళ డైరక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇల్లు కదలకుండా పని చేసుకుంటున్న వారిలో గౌతమ్ మీనన్ కూడా ఉన్నాడు. ప్రజలు కూడా ఇళ్లలోనే ఉంటూ సినిమాలు చూస్తూ గడిపేస్తున్నారు. అయితే.. ఈ పరిస్థితుల్లో ప్రజలు తాను దర్శకత్వం వహించిన ఓ రెండు సినిమాలు మాత్రం చూడొద్దని సలహా ఇస్తున్నాడు. దీనిపై ఓ వీడియోలో కారణం కూడా చెప్పుకొచ్చాడు.

 

 

‘లాక్ డౌన్ లో ప్రజలు ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా అనేక సినిమాలు చూస్తున్నారు. అయితే.. నా సినిమాల్లో అజిత్, త్రిష నటించిన ‘ఎంతవాడు గానీ..’, తమిళ్ లో శింబు, తెలుగులో నాగ చైతన్య చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో..’ సినిమాలు ఖచ్చితంగా చూడొద్దు అని చెప్తున్నాడు. కారణమేమంటే.. ఈ రెండు సినిమాల్లో హీరో దేశంలో ఉన్న మంచి ప్రదేశాలను చూడటానికి వెళ్తాడు. ప్రేమించే వ్యక్తులతో ఔటింగ్ కు వెళ్లే ఆ సినిమాలు మీకు ఆహ్లాదం కలిగిస్తాయి. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇటువంటి అవకాశం లేకపోయిందే అని మీకు నిరాశ రావొచ్చు. ఈ సినిమాలతో మనసును బాధ పెట్టుకోకండి’ అని కారణం వివరించాడు.

 

 

ఈ రెండు సినిమాలకు బదులుగా సూర్య హీరోగా వచ్చిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా చూస్తే.. ఇంట్లో ఎలా ఉండొచ్చు, ఆలోచనలు ఎలా పెంచుకోవచ్చు, భవిష్యత్తులో ఏం చేయోచ్చు అనే విషయాలపై అవగాహన వస్తుందని చెప్పుకొచ్చాడు. లాక్ డౌన్ సమయంలో పుస్తకాలు చదవండి, వీలైతే సేవ చేయండి అని కూడా పిలుపు ఇస్తున్నాడు ఈ మల్టీ టాలెంటడ్ దర్శకుడు. ప్రస్తుతం రిలాక్సింగ్ మూడ్ లో ఉన్న ప్రజలు గౌతమ్ మీనన్ సలహాలు పాటిస్తారో లేదో మరి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: