లాక్ డౌన్ కదా.. ఏం పనుంటుందిలే ..? సెలబ్రిటీలు  అందరూఖాళీయే అనుకున్నారు అందరూ. కానీ సందట్లో సడేమియా అని డ్యాన్సులు , వర్కవుట్లు చేస్తూ ఎవరి ప్రమోషన్ వాళ్లు చేసుకుంటున్నారు. పనికి మాలిన వీడియోల్ని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు. ఇదేమన్నా సెలబ్రేషన్ టైమా అని తెగ లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తోంది బాలీవుడ్ డైరక్టర్ ఫరాఖాన్.

 

ఈ లాక్ డౌన్ పీరియడ్ లో టైమ్ పాస్ కాక కొంతమంది రకరకాల వీడియోలు చేస్తున్నారు. స్టార్ హీరోలు,సీనియర్ హీరోల దగ్గరనుంచి హీరోయిన్ల పిల్లల వరకూ అందరూ ఏదోక వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. కత్రినా కైఫ్, దీపికా , కరీనా, ఆలియా , పూజాహెగ్డే  ఇలా అందరూ వంటలు చేస్తున్న వీడియోల్ని  సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు.

 

హీరోలు, హీరోయిన్లు కొంతమంది వంట చేసుకున్న వీడియోలు పెడుతుంటే మరికొంతమంది ఈ టైమ్ లో కూడా మేం ఫిట్ నెస్ చేస్తున్నాం అంటూ అనిల్ కపూర్ సైక్లింగ్ , టైగర్ ష్రాఫ్ వెయిట్ లిఫ్టింగ్ , ఇలా చాలా మంది వీడియోలతోపాటు ఇదగో మేం ఇలా ఫిట్ గా ఉన్నాం అంటూ ఫిట్ నెస్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు కొంతమంది సెలబ్రిటీలు ఇదిగో మేం ఇది వండుకున్నాం, వండుకున్న గిన్నెలు కడుక్కున్నాం, చూశారా మేం ఇల్లు శుబ్రం చేసుకుంటున్నాం, వీటన్నింటితో పాటు .. వర్కవుట్లు కూడా చేస్తున్నాం అని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వదిలి ఫుల్ టైమ్ పాస్ చేస్తున్నారు హీరోహీరోయిన్లు. వీటన్నింటినీ మించి డ్యాన్స్ వీడియాలు, ఛాలెంజ్ లు   కూడా చేస్తున్నారు కొంతమంది స్టార్లు.
IHG's strong message for celebrities sitting at <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HOUSE' target='_blank' title='home-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>home</a> is ...

 

తమ అభిమాన హీరోహీరోయిన్లు ఇలా సొంతపనులు చేసుకుంటూ బిజీగా ఉంటూ, ఆ వీడియోలు పెడుతుంటే  చాలా మంది ఎంటర్ టైన్ అవుతున్నారేమో కానీ .. ఇవన్నీ చూసిన  బాలీవుడ్ కొరియోగ్రాపర్ , డైరెక్టర్ ఫరాఖాన్  కి మాత్రం తిక్కరేగింది. అసలు దేశం చాలా క్లిష్టపరిస్తితుల్లో ఉంటే మీ పిచ్చిగంతులేంటి..? మీ వర్కవుట్ వీడియోలేంటి..? అసలు అర్దం ఉందా ఏం చేస్తున్నారో..? మీరు ఖాళీగా ఉన్నారు, టైమ్ పాస్ అవ్వట్లేదని చేస్తున్నారేమో కానీ.. కానీ దేశం అంతకన్నా ఎక్కువ ప్రమాదంలో ఉంది.. వాటి గురించి ఆలోచించంది, వాటి గురించి వర్రీ అవ్వండి, వీలైతే సహాయం చెయ్యండి అంటూ  సోషల్ మీడియాలో వీడియో పెట్టి పెద్ద క్లాస్ పీకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: