ఇప్పుడు  తెలుగు సినిమా రేంజ్ , క్రేజ్ రెండూ మారిపోయాయి. తెలుగు సినిమా ఇకపై  జస్ట్ ఓ రీజనల్ సినిమా కాదు . ఆ క్రేజ్ ని చూసి ఇంప్రెస్ అయిన హీరోలు  తెలివిగా ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ పాతుకుపోయిన స్టార్ హీరోలేకాదు .. నిన్నకాక మొన్నొచ్చిన యంగ్ హీరోలు కూడా ప్యాన్ ఇండియా లెవల్లో సినిమా చెయ్యడానికి  రెడీ అయ్యారు. స్పెషల్లీ అసలు తెలుగు గుమ్మం దాటి బయటకు వెళ్లని హీరోలు కూడా ఇండియా వైడ్ స్టార్ డమ్ కోసం  వెయిట్ చేస్తున్నారు. 


టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లూ అర్జున్ -సుకుమార్ తో చేస్తోన్న పుష్ప మూవీని ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు  పోస్టర్ తో పాటు అనౌన్స్ చేశారు. టాలీవుడ్ లో బన్నీకి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు.. ఇదే క్రేజ్ మళయాలంలో కూడా ఉంది బన్నీకి. ఇంతకుముందెప్పుడూ ఆ  ఇండస్ట్రీస్ ని టచ్ చెయ్యని బన్నీ.. ఫస్ట్ టైం పుష్ప మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ గామారబోతున్నాడు. తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో  ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి.. అన్ని భాషల్లోఆ సినిమా పోస్టర్స్ కూడా రిలీజ్ చేశాడు అల్లు అర్జున్.

 

 టాలీవుడ్ నుంచి ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి చేసిన బాహుబలి వల్లే టాలీవుడ్ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు , తెలుగు సినిమాకు క్రేజ్ పెరిగింది. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ ద్వారా  టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిని  ఒకేసారి ప్యాన్ ఇండియా స్టార్స్ గా మార్చబోతున్నాడు జక్కన్న. ఇప్పటివరకు ఈ ఇద్దరు హీరోలు ఇలా ప్యాన్ ఇండియా మూవీ చేసింది లేదు.. తెలుగు లో చాలా పెద్దస్టార్స్ అయినా.. టాలీవుడ్ గుమ్మం దాటలేదు. ఇక దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న రౌంధ్రం రణం రుధిరం సినిమాను ఐదు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ మూవీ నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: