పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులే కాదు భక్తులు కూడా ఉంటారు.. మాములుగా అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కు మాత్రమే అభిమానులు కాస్త భక్తులయ్యారు. అదేంటి అంటే అదంతే దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు అంటున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుండి అజ్ఞాతవాసి వరకు పవన్ చేసిన ప్రతి సినిమా హిట్టు ప్లాప్ అనే తేడా లేకుండా వసూళ్లు సాధించాయి. అందరి హీరోలది ఒకదారి అయితే తనదో దారి అన్నట్టుగా సినిమాలు చేశాడు పవన్ కళ్యాణ్. అందుకే అప్పటి యువతనే కాదు ఇప్పటి యూత్ కు పవన్ అంటే ఒక పిచ్చి.. పవర్ స్టార్ అంటే ఒక అడిక్షన్ అవుతున్నారు. 

 

తాను చేసే సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన పవన్ కేవలం సినిమాలో హీరోగానే కాదు సాటి మనిషిగా అతన్ని అభిమానించడం మొదలుపెట్టారు. అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కూడా యూత్ ఆకట్టుకునే స్పీచ్ లు, కార్యక్రమాలతో మెప్పించిన పవన్ ఆ తర్వాత తాను పెట్టిన జనసేన కోసం కష్టపడటం చూసి అతని అభిమానులు కాస్త భక్తులుగా మారాయి. సాటి మనిషిని అభిమానించడం వరకు ఓకే కానీ మరి భక్తులుగా మారడం లాంటివి ఓవర్ గా అనిపించడం కామనే.. కానీ ఎవరేం అనుకున్నా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ ను అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉంటారు.

 

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఇన్నాళ్లు పవన్ వెనుక ఉంటూ వచ్చిన పవర్ స్టార్ ఫ్యాన్స్ అయన రాజకీయా ప్రస్థానంలో కూడా భాగం అవ్వాలని అనుకుంటున్నారు. అయితే పవన్ పోటీ చేసిన మొదటిసారి ఎలక్షన్స్ లో అతనికి చేదు అనుభవం ఎదురైంది. అయినా సరే నిరాశ చెందకుండా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్.     

 

మరింత సమాచారం తెలుసుకోండి: