కింగ్ అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘హలో బ్రదర్’ మూవీ కూడా ఒక‌టి. క్లాస్‌, మాస్‌, కామెడీ ఇలా అన్నీ ఉన్న అతి త‌క్కువ సినిమాల్లోనూ హలో బ్రదర్ ఉండ‌డం మ‌రో విశేషం. ఈ సినిమాలో నాగార్జున మెద‌టిసారి డ్యూయ‌ల్ రోల్‌లో చేశాడు. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వం వ‌హించిన ఈ చిత‌రంలో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా న‌టించారు. మ‌రియు నాగార్జున డ్యుయల్ రోల్, వాటిలో ఒకటి క్లాస్, మరోటి మాస్. కథకి తగ్గ క్యారెక్టర్లు, క్యారెక్టర్లకి తగ్గ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నాగ్‌.

 

1994 ఏప్రిల్ 20 న రిలీజ్ అయిన ఈ సినిమా 2020 ఏప్రిల్ 20 నాటికి 26 ఏళ్లు అయ్యింది. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, మల్లిఖార్జున రావు, బాబూ మోహన్ తదితరులు ఈ చిత్రంలో చేసిన కామెడీ అంతా ఇంతా కాద‌నే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో పాట‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  రాజ్-కోటి సంగీతం సినిమాకి హైలెట్‌గా నిలిచింది. కన్నెపెట్టరోయ్, కన్ను కొట్టరోయ్ సాంగ్‌లో రంభ, ఆమని, ఇంద్రజ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. మ‌రియు  ఈ చిత్రంలో ‘సుర్రు సుమ్మైపోద్ది’ అనే డైలాగ్ ఇప్పటికీ అందరి నోట్లో నానుతూనే ఉంటుంది.

 

ఇక రెండున్న‌ర‌ కోట్ల బడ్జెట్ తో పూర్తి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.  మొదటి వరం కోటికి పైగా వసూలు చేసింది. 70కేంద్రాల్లో 50రోజులు, 24కేంద్రాల్లో 100రోజులు ఆడింది. ఈ క్ర‌మంలోనే 100రోజులకు 8.5కోట్ల షేర్ రాబట్టింది. అప్పట్లో హయ్యస్ట్ షేర్ ఇది. అయితే ఇండస్ట్రీ హిట్ ని తృటిలో మిస్సయింది. కానీ, హైద్రాబాద్ దేవి థియేటర్లో 30రోజులు 120 హౌస్ ఫుల్ షోలతో ఇండియా రికార్డ్ కొట్టి నాగార్జున కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ చిత్రాన్ని తమిళంలో డబ్ చేయగా.. అక్కడ కూడా సూప‌ర్ హిట్‌గానే నిల‌వ‌డం విశేషం. మ‌రియు ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: