ట్రిపుల్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు ., ఇక ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపిస్తున్నాడు. దీనికి సంబందించి అఫీషియల్ లుక్స్ రిలీజ్ చేశాడు రాజమౌళి. అయితే ఈ సినిమాలో మరో రెండు క్యారెక్టర్స్ కీరోల్స్ ప్లే చెయ్యబోతున్నాయి. అదే బాలీవుడ్ యాక్టర్స్ అజయ్ దేవ్ గన్, ఆలియా.  సినిమాలో వీళ్లిద్దరి క్యారెక్టర్ కి స్పెషల్ ఇంపార్టెన్స్  ఉందటున్నాడు రాజమౌళి.

 

నిన్నటి వరకూ ఆలియా భట్ రామ్ చరణ్ కు జంటగా నటించబోతోందని , వీళ్లిద్దరి మద్యమంచి బాండింగ్ ఉంటుందని ఎవరి తెలిసిన జోస్యం వాళ్లు చెప్పారు. కానీ ఇదేం నిజం కాదని తేల్చిచెప్పాడు రాజమౌళి.  రామ్ చరన్ కి జంటగా కాకపోతే .. ఎన్టీఆర్ సరసన నటిస్తుందేమో అనుకుంటున్నారా..? అలా అని ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా కాదు. అసలు ఆలియా భట్ ఎవరికీ జంటగా నటించట్లేదట.

 

ఆలియా ఓ ఇండిపెండెంట్ పవర్ ఫుల్ క్యారెక్టర్ అని,. సినిమాలో ఆలియా క్యారెక్టర్  ఇన్నోసెంట్ గా, సెన్సిబుల్ గా ఎట్ ద సేమ్ టైమ్ అంతే కాన్‌ఫిడెంట్ గా పవర్ ఫుల్ గా ఉంటుందని రివీల్ చేశాడు జక్కన్న. రియల్ లైఫ్ లో కూడా ఆలియా ని చూస్తే అలానే అనిపిస్తుంది. అందుకే అందరినీ కాదనుకుని క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటుందని ఆలియా భట్ ని సెలక్ట్ చేశామని చెబుతున్నాడు రాజమౌళి.

 

ఆలియా భట్ తో పాటు బాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్ స్టార్ అజయ్ దేవ్ గన్ కూడా ట్రిపుల్ ఆర్ లో  చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెయ్యబోతున్నాడని , సినమా మొత్తానికి   సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ గా అజయ్ రోల్ ఉంటుదని చెబుతున్నాడు రాజమౌళి. ఎవరిని చూడగానే నమ్మాలని పిస్తుందో , నమ్మకానికి నిలువుటద్దంలా కనిపిస్తారో  అలాంటి క్యారెక్టర్ అజయ్ దేవ్ గన్ దని, ఈ క్యారెక్టర్ కి అదే రేంజ్ లో న్యాయం చేస్తారనే సెలక్ట్ చేశాడట రాజమౌళి. అంతేకాదు .. అసలు   ఇండియా మొత్తంమీద  ఈ క్యారెక్టర్ లో అజయ్ దేవ్ గన్ ని తప్ప వేరే వాళ్లని ఊహించలేమని, అంత  కన్విన్సింగ్ గా తన నటనని చూపిస్తారని అందుకే ఏ మాత్రం ఆలోచించకుడా అజయ్ దేవ్ గన్ ని ఆ పాత్రకోసం సెలక్ట్ చేసినట్టు చెప్పాడు రాజమౌళి.

 

ఇప్పటివరకూ సినిమాలో ఆలియా రామ్ చరణ్ కి జంటగా చేస్తోందని, అజయ్ దేవ్ గన్ నాయకుడి పాత్ర పోషిస్తున్నాడని రకరకాల రూమర్స్ నడిచాయి. కానీ రాజమౌళి మాత్రం  అజయ్ దేవ్ గన్ ని, ఆలియా భట్ ని ఎందుకు సెలక్ట్ చేశాడో , సినిమాలో ఎవరికి ఏమౌతారో క్లారిటీ ఇచ్చేశాడు .. అంతేకాదు ఈ బాలీవుడ్ యాక్టర్లని సెలక్ట్ చెయ్యడానికి వెనక రీజనేంటో కూడా చెప్పేశాడు.  అందుకే రాజమౌళి యా మజాకానా అనుకుంటున్నారు అందరూ. 

మరింత సమాచారం తెలుసుకోండి: