ఏది ఎపుడు ఎలా జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. దాని విధి అని చాలామంది నమ్ముతారు. ఇక ప్రక్రుతిలో మనిషి కూడా భాగమేనన్న సంగతిని మరచిన ప్రతీ సారీ పెను విపత్తు ముందుకు దూసుకువస్తోంది. మరమ్మతులు చేసి మరీ వెళ్తోంది.

 

ఇది వందేళ్ళకు ఒకసారి జరుగుతోంది.  ఇపుడు కరోనా అలా వచ్చి విశ్వ మానవాళికి హెచ్చరికలు చేస్తోంది. ఇదిలా ఉండగా కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో తెర మీద బొమ్మలు వెనక్కిపోయాయి. సినిమా హాళ్ళు మూత పడ్డాయి. ఇక మరో వైపు షూటింగులు రద్దు అయ్యాయి.

 

ఇక కరోనా దేశంలో వీర విహారం చేస్తోంది. దాంతో లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తారని అంటున్నాఉ. అదే కనుక జరిగితే మరింతకాలం సినిమా హాళ్ళు మూసివేయకతప్పదు, ఇక కొత్త సినిమాల సంగతి కూడా దేవుడికి ఎరుకే.

 

మరో వైపు మూడు నెలల పాటు సినిమా హాళ్ళు మూసివేయక తప్పదని ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ఈ మధ్యనే మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా రాజమౌళి కూడా ఇదే మాట అంటున్నారు. కనీసం ఆరు నెలల కాలం వరకూ సినిమా హాళ్ళు తెరచుకునే పరిస్థితి లేదని దర్శక ధీరుడు అంటున్నారు.

 

అంటే దసరాకేనని అంతా అంచనా వేస్తున్నారు. అప్పటికి పూర్తి అయిన పెద్ద సినిమాలు ఏమైనా ఉంటే అవి దసరాకు సినిమా హాళ్ళకు వస్తాయి. ఆ తరువాత చిన్నా పెద్దా సినిమాలు వస్తాయి. ఇక సంక్రాంతి రద్దీ కూడా అలాగే ఉంటుంది.

 

మొత్తం మీద దసరా వరకూ సినిమా సరదాలు లేవని చిత్ర ప్రముఖులు లెక్క కట్టి మరీ చెబుతున్నారు. సినీ ప్రియులైనా ఫ్యాన్స్ అయినా అంతవరకూ బొమ్మ కొసం ఎదురుచూస్తూ ఉండకతప్పదు, ఇక సినిమా హాల్స్ తెరచినా జనం ఎలా వస్తారన్నది కూడా ఆసక్తికరమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: