భ‌క్తి సినిమాల్లో బాగా ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అన్న విష‌యం అంద‌రికి తెలిసందే. విప్ర నారాయ‌ణ‌న ఉంచి క‌బీర్‌దాస్ వ‌ర‌కు ఏ పాత్ర‌లో న‌టించినా ఆ పాత్ర‌లో ఇమిడిపోయి న‌టించేవారు. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ అలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డం కేవ‌లం ఆయ‌న వంశం నుంచి వ‌చ్చిన అక్కినేని నాగార్జున‌కు ద‌క్క‌డం ప్ర‌త్యేక‌మ‌ని చెప్పుకోవ‌చ్చు. నాగార్జున మొద‌టి సినిమా విక్ర‌మ్ చిత్రంలో కాస్త త‌ర‌బ‌డినా శివ నుంచి  కాస్త పుంజుకున్నారు. మాస్ సినిమా అయిన శివ చిత్రంలో న‌టించ‌డ‌మే కాకుండా గీతాంజ‌లి వంటి ప్రేమ చిత్రాల్లో న‌టించి ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అనిపించుకున్నారు. అలాంటి క్ర‌మంలో స‌డెన్‌గా ఆయ‌నను ఓ భ‌క్తుడుగా చూపించాల‌ని ఆలోచ‌న కె. రాఘ‌వేంద్ర‌రావుకి  రావ‌డం..ఆ పాత్రకి నేను స‌రిపోతానా అన్న సందిగ్ధంలో ఉన్న నాగార్జున‌ను ఆ విష‌యం నాకు వ‌దిలేయ్ అంటూ భ‌రోసా ఇచ్చి ఆ పాత్ర కార్య‌రూపం దాల్చ‌డానికి శ్రీ‌కారం చుట్టారు. 

 

సినిమా విడుద‌ల త‌ర్వాత కొద్ది రోజులు ఆ సినిమాని ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అప్ప‌టికే ప‌లు ప్రేమ‌క‌థా చిత్రాలు, కుటుంబ‌క‌థా చిత్రాల్లో చూసిన నాగార్జున‌ను ఒక వైవిధ్యాన్ని కోరుకోవ‌డంతోపాటు పోస్ట‌ర్ల‌లో అన్న‌మయ్య గెట‌ప్‌లో స్వామివారిని వేడుకుంటూ ఉండే ఓ స‌న్నివేశంలో ప్రేక్ష‌కులు నిజ‌మై అన్న‌మ‌య్య‌గా ఫీల‌యి థియేట‌ర్ల‌కు రావ‌డం మొద‌లు పెట్టారు. అలా వ‌చ్చిన వారికి మొద‌టి భాగంలో ఇద్ద‌రు మ‌ర‌ద‌ళ్ళ‌తో పాట‌లు పాడుతూ స‌ర‌దాగా గ‌డిపే స‌న్నివేశాలు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించినా ఒక్క‌సారిగా ఆయ‌న భ‌క్తుడిగా మారే క్ర‌మం నుంచి సినిమా స్థాయిని ఎక్క‌డికో తీసుకెళ్ళింది. గ‌తంలో ఉన్న నాగార్జున‌ను మ‌ర్చిపోయేలా చేసింది ఈ సినిమా. ప్ర‌ధానంగా శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి గురించి అన్న‌మ‌య్య కీర్త‌న‌లు అంద‌రినీ ఆకట్టుకున్నాయి. 

 

దీనికి తోడు కీర్త‌న‌ల‌కి ప్ర‌ధానంగా బాణీల‌నేవి వ‌న్నె తీసుకువ‌స్తాయి. దాన్ని స‌మ‌కూర్చిన ఎం.ఎం. కీర‌వాణి దేవుడు న‌న్ను అన్న‌మ‌య్యే ఆవ‌హించి ఇలా చేయించాడా అనే విధంగా ఆయ‌న‌కు స్పంద‌న ల‌భించింది. అదే అనుభూతి ప్రేక్ష‌కులు గురి కావ‌డం జ‌రిగింది. దీని అంత‌టికి సూత్ర‌ధారుడైన రాఘ‌వేంద్ర‌రావు అయిన స్థ‌బ్ద‌త‌గా  ఆయ‌న కెరియ‌ర్ ఈ సినిమాతో తారా స్థాయికి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: