మాస్ మహారాజ రవితేజ హీరోగా హన్సిక మోత్వానీ, రెజీనా హీరోయిన్లుగా తెరెకెక్కిన సినిమా పవర్. కొన్నేళ్ల క్రితం యువ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన డెబ్యూ మూవీ ఇది. తొలి సినిమా అయినప్పటికీ కూడా ఆ సినిమా విజయంతో ఎంతో గొప్ప పేరు దక్కించుకున్న దర్శకుడు బాబీ, ఆ తరువాత ఏకాంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నాడు. 

Pawan Helping Bobby In Hit And Run Case?

 

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై ఎంతో భారీగా నిర్మితం అయిన ఈ సినిమాని దర్శకుడు బాబీ ఎంతో కష్టపడి తెరకెక్కించినప్పటికీ సినిమా మాత్రం ఆశించిన రేంజ్ లో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. జానీ తరువాత పవన్ కళ్యాణ్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే సాంగ్స్ అందించడం జరిగింది. ముందుగా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ కు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉండడం జరిగింది. 

 

అయితే ఆ సినిమా పరాజయానికి బాధ్యత తనదే అని, తన ఫేవరెట్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారు, స్వయంగా తనను పిలిపించి మరీ ఆ సినిమా అవకాశం ఇచ్చారని, వాస్తవానికి అది మరొక దర్శకుడు చేయవలసిన సినిమా అని, అయితే తనకు అప్పగించిన బాధ్యత సక్రమంగా నెరవేర్చనందుకు ఇప్పటికీ తాను లోలోపల కొంత మధన పడుతుంటానని ఇటీవల పలు సందర్భాల్లో దర్శకుడు బాబీ తెల్పడం జరిగింది. నిజంగా పైనున్న ఆ భగవంతుడు కనుక తనకు పవన్ కళ్యాణ్ గారిని మళ్ళి దర్శకత్వం వహించే అవకాశం ఇస్తే, ఈ సారి తప్పకుండా సూపర్ కథతో అద్భుతంగా దర్శకత్వం వహించి, ఆ సినిమా విజయంతో పవన్ గారి ఋణం తీర్చుకుంటానని బాబీ చెప్పడం జరిగింది. మరి ఆయన ఎదురుచూస్తున్న సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: