పూరి జ‌గ‌న్నాథ్ క్రియేటివిటీ డైరెక్ట‌ర్ అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకున్నాడు. స్టార్ హీరోలంద‌రితోనూ సినిమాలు చేసి మంచి హిట్లు కొట్టాడు. అయితే ఒక్క‌సారిగా ఎందుకో కెరియ‌ర్‌లో డ‌వున్ అయ్యాడు. దాంతో పెద్ద‌గా సినిమాల్లేక కొంత కాలం ఇబ్బందిప‌డ్డారు. వ‌రుస ఫ్లాప్‌ల‌తో  స‌త‌మ‌త‌మ‌య్యాడు. ఇక‌వరుస ఫ్లాప్‌లు రావటంతో స్టార్ హీరోలు పూరికి ముఖం చాటేశారు. అయితే ఆయ‌న  చాలా మంది స్నేహితులను నమ్మాన‌ని. వాళ్లు కత్తి విసరనక్కర్లేదు. పక్క నుంచే పొడుస్తారు. దిగినట్టు కూడా మ‌న‌కు తెలియదన్నారు. అయితే  ఆయ‌న‌ను అయిన‌వారే చాలా మంది స్నేహితులు మోసం చేశార‌ని పూరి వాపోయారు. దాంతో తీవ్రంగా న‌ష్ట‌పోవ‌డంతో ఆస్తి అంతా పోయింది. నడి రోడ్డు పై నిలబడ్డాన‌ని ఆయ‌న అన్నారు. 

 

అయితే అలా జ‌ర‌గ‌డానికి ముఖ్యంగా ఇది క్రియేటివ్‌ జాబ్ కావ‌డంతో.. సినిమాలు తీసుకోవడంపైనే  ఆయ‌న ఎక్కువ దృష్టి సారించడంతో , ఇతర విషయాలపై పెద్ద‌గా ఆశ‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో అవ‌న్నీ స్నేహితులే కాబ‌ట్టి వారు చూసుకుంటార‌నుకున్నారు. అయితే ఆయ‌న ఎప్పుడూ కూడా  ‘భారీ రెమ్యునరేషన్‌ తీసుకుందాం. భూములు కొందాం. వ్యాపారం చేద్దాం’ ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే ఆయ‌న‌కు డబ్బుపై పెద్ద‌గా ఆసక్తి లేకపోవడం, అంతా వాళ్లు చూసుకుంటారులే అన్న న‌మ్మ‌కంతో వాళ్ళ‌పైన వ‌దిలేయ‌డంతో ఇలా జ‌రిగింద‌ని ఆయ‌న ఇటీవ‌లె ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

 

సుదీర్ఘ‌కాలం అనంత‌రం ఇటీవల ఇస్మార్ట్‌ శంకర్‌తో తిరిగి ఫాంలోకి వచ్చాడు పూరి. ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో యంగ్ జనరేషన్‌ హీరోలు పూరితో సినిమా చేసేందుకు తిరిగి ఆసక్తికనబరుస్తున్నారు. పూరి మాత్రం నెక్ట్స్‌ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ హీరోగా ఫైటర్‌ సినిమాను ప్రకటించాడు పూరి. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఇక  విజయ్‌కు జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఉండటం, పూరికి గతంలో బాలీవుడ్‌లో సినిమా చేసిన అనుభవం ఉండటంతో ఫైటర్‌ను పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: