నేచురల్ స్టార్ నాని కి సక్సస్ వచ్చి చాలా కాలమైంది. 2019 లో జెర్సీ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని అనుకున్నప్పటికి నాని ఆశలని ఆవిరి చేసింది జెర్సీ. వాస్తవంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది... విమర్శకుల ప్రశంసలని దక్కించుకుంది. కాని కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా సక్సస్ అందుకోలేకపోయింది. లాభాల విషయంలో ఈ సినిమా మేకర్స్ కి గట్టి షాకిచ్చింది. ఈ సినిమా తర్వాత విక్రం కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ కూడా ఫ్లాప్ గా మిగిలింది.

 

ఇక 2020 లో నాని తన 25వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏ హీరో అయినా 25వ సినిమా అంటే చాలా పవర్ ఫుల్ గా ఉండాలి... తన కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా చేయాలని అనుకుంటాడు. కానీ మన నేచురల్ స్టార్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. తన 25వ సినిమాలో విలన్ గా నటించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'వి' సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాడు. కాని ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. 

 

ఇక నాని తన 26 వ సినిమా 'టక్ జగదీష్'. నిన్ను కోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ముగ్గురు అన్నదమ్ముల మధ్య  సంబంధం ఎలా ఉంటుందో చూపిస్తూ దర్శకుడు శివ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు. అయితే ఇప్పుడు నానీ ప్లాన్స్ అన్ని తారుమారు అయిపోయాయి. 

 

అయితే మే 7 తర్వాత లాక్ డౌన్ విరమిస్తే జూలై లో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాల్లో ఉన్నారు. అందులో అందరికంటే ముందుగా నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నారు. రిలీజ్ చేయాలనుకున్న సినిమాలలో ముందు నాని నే ఉన్నాడు. అయితే ఇది నాని కి రిస్క్ అవుతుందా అని కొంతమంది అనుకుంటున్నారట. లాక్ డౌన్ తర్వాత సినిమాలు రిలీజ్ చేస్తే జనాలు థియోటర్స్ కి వస్తారా అన్నది ఇంకా సందేహం గా ఉంది. అయినా నాని దిల్ రాజు ధైర్యం చేసి ముందు రావడానికి చూస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: