లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో వారిని సినిమాలే ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు కొత్త సినిమాలు చూస్తే మరికొందరు ఓల్డ్ మూవీస్ చేస్తారు. మరికొందరు కామెడీ సినిమాలు చూస్తారు. వీరికి నవ్వుల రేడు రాజేంద్రుడి సినిమాలు పెద్ద రిలీఫ్ ని ఇస్తాయి. కామెడీ హీరో అనే ప్రత్యేకమైన ముద్ర వేసుకుని తన పరిధిలో ఎన్నో సినిమాల్లో నటించాడు. దివంగత పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా ఉన్న సమయంలో.. ‘పని భారంతో ఉన్న నాకు రిలీఫ్ ను ఇచ్చేది రాజేంద్రప్రసాద్ సినిమాలు’ అని చెప్పడం విశేషం.

IHG

 

రాజేంద్రప్రసాద్ సినిమాల్లో టాప్ 5 మూవీస్ ను జడ్జ్ చేయడం కొంచెం కష్టమే అయినా బాగా హిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. రాజేంద్రుడికి బ్రేక్ నిచ్చిన లేడీస్ టైలర్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఊళ్లో ఏకైక టైలర్ గా ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ పండించిన కామెడీ ఏకపాత్రాభినయం అని చెప్పాలి. ముఖ్యంగా వచ్చీరాని హిందీలో ‘సుజాత.. మై మర్ జాతా’ అనే సింగిల్ టేక్ డైలాగ్ చెప్తుంది ఆ సినిమా గొప్పదనం. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాంలో పిసినారి పాత్రలో భార్యనే దూరం చేసుకుంటాడు. కానీ.. మళ్లీ దగ్గరైన తర్వాత మరింత కామెడీ పండిస్తాడు.

IHG

 

ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో ప్రతి సన్నివేశం కూడా హాస్యభరితమే. జాతకాల పిచ్చోడిగా రాజేంద్రుడు సినిమాను రఫ్పాడించాడనే చెప్పాలి. అప్పుల అప్పారావులో రాజేంద్రప్రసాద్ కామెడీ అద్భుతం. అబద్దాలాడుతూ అప్పులు చేసే వ్యక్తిగా హాస్య రసంలో ముంచి తేల్చేస్తాడు. ఏప్రిల్ 1 విడుదల సినిమాలో కూడా అబద్దాలు ఆడుతూ.. ఓ పరిస్థితిలో కేవలం నిజాలే చెప్పాల్సి వస్తుంది. ఆ సమయంలో రాజేంద్రుడు చేసే అమాయకత్వపు నటన, వాటితో వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి.  

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: