ఒకప్పటితో పోలిస్తే మారుతున్న కాలాన్ని బట్టి ప్రతి రంగంలోనూ రాను రాను కొంత విచిత్రమైన ధోరణులు మనుషుల్లో మొదలయ్యాయి. ఇక క్రీడలు, సినిమాల వంటి రంగాల్లో అయితే కొందరు నటీనటులు, క్రీడాకారులు తమ వ్యక్తిగత విషయాల్లో ఎవరికి నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ ఉండడంతో పాటు, ఒకవేళ వారిలో ఎవరైనా తప్పుచేసినట్లు అనిపించి ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ అదేంటని ప్రశ్నిస్తే, మా ఇష్టం మేము ఎంతో కష్టపడి పైకి వచ్చాము, అయినా మా వ్యక్తిగత విషయంలో మీ జోక్యం అనవసరం అంటూ కొంతగా గట్టిగా సమాధానం చెప్తున్న వారు అక్కడక్కడా కొందరు ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. 

 

ఇక ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ముందుగా మలయాళ సినిమా పరిశ్రమ నుండి, ఆ తరువాత తమిళ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా అడుగుపెట్టి, ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని, అక్కడి నుండి మెల్లగా వస్తున్న అవకాశాలతో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ కి ఎదిగిన ఒక హీరోయిన్ గురించి అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కూడా విపరీతంగా చర్చ నడుస్తోంది. ముందుగా ఒక కుర్ర హీరోతో ప్రేమాయణం నడిపిన ఆ హీరోయిన్, ఆ తరువాత మరొక హీరోతో కూడా అఫైర్ నడిపింది, మరి వారిద్దరి పరిస్థితి ఏమైందో ఏమో తెలియదుగాని, హఠాత్తుగా అప్పట్లో పెళ్ళైన ఒక నటుడు, కం దర్శకుడిని ప్రేమించి ఆల్మోస్ట్ పెళ్లివరకు వెళ్లిన సదరు హీరోయిన్, ప్రస్తుతం ఒక యువ దర్శకుడితో కొద్దిరోజులుగా చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. 

 

ఇప్పటికే వీరిద్దరి జంటను గురించి కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతుండడంతో, మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిందట హీరోయిన్. అయితే ఆ విషయం ఆమె అధికారికంగా ప్రకటించకపోవడంతో, ఏంటి అతడితో కూడా టైం పాసేనా అంటూ కొందరు ప్రేక్షకులు ఆమెను సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రశ్నిస్తుండగా, సినిమా ఇండస్ట్రీ లో ఎందరో నటీనటులు ఉండగా, కొన్నాళ్లుగా నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ విధంగా కామెంట్స్ చేయడం సరికాదని, అయినా అందరి వలె తాను కూడా కష్టపడి పైకి వచ్చానని, అటువంటి నా జీవితం మీద నాకు హక్కు ఉంటుంది, దయచేసి నా పర్సనల్ మేటర్ లో తలదూర్చవద్దు అంటూ సదరు హీరోయిన్ గారు తన గురించి కామెంట్స్ చేస్తున్న వారి పై గట్టిగా ఫైర్ అవుతోందట.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: