మహేష్ బాబు.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈయన సినిమాలు ఎంత సూపర్ హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అన్ని సినిమాలు అద్భుతం కాకపోవచ్చు.. కానీ అన్ని సినిమాలు మనం చూడగలం.. ఎందుకంటే అక్కడ మహేష్ బాబు నటన అద్భుతం కాబట్టి.. ఇంకా అలాంటి సినిమాలలో టాప్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఈ లాక్ డౌన్ బోర్ గా కాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం.. 

 

టాప్ 5 మహేష్ బాబు సినిమా.. ఒక్కడు! 

 

ఒక్కడు.. అబ్బా ఈ సినిమా ఎప్పటికి ఎవర్ గ్రీన్ ఏ.. ప్రకాష్ రాజ్ విలన్ గా భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఓ అద్భుతం.. అలాంటి అద్భుతమైన ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సినిమా అంటే కర్నూల్ కొండారెడ్డి బురుజు గుర్తొచ్చేస్తుంది. ఈ సినిమాను మీరు లాక్ డౌన్ లో ఎన్ని సార్లు అయినా చూసేయచ్చు. 

 

టాప్ 4 మహేష్ బాబు సినిమా.. అతడు! 

 

నిజం చెప్పండి.. ఈ సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇష్టం కదా! ఎంతైనా త్రివిక్రమ్ కదా! సినిమాలు నచ్చుతాయి మరి.. ఇంకా అలాంటి అద్భుతమైన సినిమాను స్టార్ మా రెండు వారాలకు ఒకసారి టీవీలో వేస్తుంది.. ఇంకా ఈ సినిమా అద్భుతమే కదా! లాక్ డౌన్ లో చూసి ఎంజాయ్ చెయ్యండి.. 

 

టాప్ 3 మహేష్ బాబు సినిమా.. శ్రీమంతుడు! 

 

ఒక ఊరిని దత్తత తీసుకోవాలి అని ఈ సినిమాను చూస్తేనే తెలుస్తుంది.. ఎంత ఉన్న సరే మంచి పని చెయ్యకపోతే వేస్ట్ అనే విషయాన్నీ మనకు ఈ సినిమా నేర్పిస్తుంది.. ఇంకా అలాంటి అద్భుతమైన ఈ సినిమాను ఎన్ని సార్లు అయినా చూడచ్చు.. ఈ సినిమా చూస్తే బహుశా మీలో కూడా మార్పు రావచ్చు.. 

 

టాప్ 2 మహేష్ బాబు సినిమా.. భారత్ అనే నేను! 

 

కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు సంవత్సరం వచ్చింది.. ఈ సినిమా ఎంత అద్భుతం అంటే.. మనకు ఇలాంటి ఓ సీఎం కావాలి రా అని అనిపించేలా సినిమా ఉంది.. ఇంకా అచ్చం అలాంటి ముఖ్యమంత్రే మన రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నాడు.. రాజకీయం కాదు పేదల చిరునవ్వే ముఖ్యం అని. 

 

టాప్ 1 మహేష్ బాబు సినిమా.. పోకిరి! 

 

ఎవర్ గ్రీన్ సినిమా.. సంవత్సరాలు సంవత్సరాలు థియేటర్లలో ఆడిన సినిమా ఇది.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఓ అద్భుతం.. ఇంకా ఈ సినిమాలో వచ్చే ఆ ఆ నా మాటే వింటారా అనే ఐటమ్ సాంగ్ అబ్బో.. చెప్పకూడదు లెండి.. ఈ సినిమాను లాక్ డౌన్ లోనే కాదు.. ఆఫీస్ టైంలో చుసిన తప్పు లేదు... 

 

ఇవి అండి టాప్ 5 సినిమాలు.. ఇవి మాత్రమే అని చెప్పను.. చాలా ఉన్నాయి.. కానీ అందులో టాప్ 5 అని నెటిజన్లు నేను అన్న సినిమాలు ఇవి.. మీకు ఇంకా ఏ సినిమాలు అయినా ఉంటే కామెంట్స్ చేసి తెలపండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: