తెలుగులో హీరోయిన్ గా అవకాశం వచ్చింది అంటే కొద్దిగా టాలెంట్ చూపిస్తే చాలు ఇక్కడ క్రేజ్ తెచ్చుకున్నట్టే. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బాగా ఉంటుంది. అందుకే పర్వాలేదు అనుకున్న ప్రతి హీరోయిన్ కు ఇక్కడ మంచి ఛాన్సులు వస్తాయి. ఇక ఈ క్రమంలో మోడల్ కమ్ హీరోయిన్, బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పూరి డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో అమ్మడి అందాలను బాగా వాడేసుకున్నాడు పూరి. 

 

సరైన ఛాన్స్ రావాలే కానీ తన టాలెంట్ చూపించేందుకు ఎదురుచూస్తున్న నిధి అగర్వాల్ కు ఇస్మార్ట్ శంకర్ ఛాన్స్ అదృష్టంగా మారింది. సినిమా సూపర్ హిట్ అవడంతో అందులో నటించిన నిధి, నభా నటేష్ లకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నిధి మాత్రం తన కిట్టీలో క్రేజీ సినిమాలు వేసుకుంటుంది. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా లేటెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. 


రమేష్ వర్మ డైరక్షన్ లో రవితేజ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ కు లక్కీ ఛాన్స్ వచ్చిందట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్న రవితేజ రమేష్ వర్మ సినిమా కూడా క్రేజీగా ఉండబోతుందని చెబుతున్నాడు. ఈ సినిమా కథ, కథనాలు కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. సినిమాలో నిధి హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: