అవును... రాజమౌళి సినిమాలు చాలా గొప్పగా ఉంటాయి.. కానీ ఒకటి లేదా రెండు సార్ల కంటే ఎక్కువ చూడలేం.. కానీ త్రివిక్రమ్ సినిమాలు అద్భుతం.. అమోగం.. ఎన్ని సార్లు అయినా చూడచ్చు.. మళ్లీ మళ్లీ చూడచ్చు.. చూసినోళ్లకు చూసినంత.. ఎందుకంటే డైలాగ్స్ అలా ఉంటాయి.. మాటల మాంత్రికుడు రాసిన డైలాగ్స్ కదా! అద్భుతంగానే ఉంటాయి. అయితే అందులో టాప్ 5 సినిమాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఇంట్లోనే అవి చూసి ఆనందిద్దాం. 

 

టాప్ 5 త్రివిక్రమ్ సినిమా.. అతడు 

 

సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే... ఆ ఫైట్స్.. ఆ కామెడీ అబ్బో.. ఇలా ఒకటి ఏంటి ఎన్ని చుసిన తక్కువే.. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఎంతో అద్భుతమైన ఈ సినిమాను లాక్ డౌన్ లో పది సార్లు చుసిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది అంటే నమ్మండి.. 

 

టాప్ 4 త్రివిక్రమ్ సినిమా.. అత్తారింటికి దారేది 

 

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఓ అద్భుతం.. ఇందులో డైలాగ్స్ వింటే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.. అలా ఉంటాయి డైలాగ్స్.. అప్పట్లో ఈ సినిమా ఓ పెద్ద సూపర్ హిట్.. ఈ సినిమాను మళ్లీ చూడాలి అని అనిపించేలా తీశారు. 

 

టాప్ 3 త్రివిక్రమ్ సినిమా.. అరవింద సామెత 

 

అరవింద సామెత.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో పూర్తయ్యింది. గొడవలు వద్దు.. అందరూ కలిసిమెలసి ఉండండి.. ఎన్ని తలలు తేగల.. అరవింద కనువిప్పు కలిగిచిన్నట్టు వచ్చే డైలాగులు సూపర్ అంటే సూపరు. 

 

టాప్ 2 త్రివిక్రమ్ సినిమా.. జల్సా  

 

జల్సా.. మై హార్ట్ ఈజ్ బీటింగ్.. అదోలా!! అబ్బో ఈ సినిమా ఎంత బాగుంది అండి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు.. ఇంకా ఇందులో ఇలియానా హీరోయిన్.. ఈ సినిమాను ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్, పాటల కోసం చేసేయొచ్చు.. అంత అద్భుతంగా ఉంటాయి. 

 

టాప్ 1 త్రివిక్రమ్ సినిమా.. జులాయి 

 

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంత క్లాస్ గా.. ఎంత మాస్ గా.. ఎంత లవబుల్ గా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసిన చూడాలి అనిపిస్తుంది అంటే నమ్మండి.. ఈ లాక్ డౌన్ లో మంచి టైం పాస్ అయ్యే సినిమా ఇది. 

 

త్రివిక్రమ్ ఎన్నో సినిమాలు తీశారు.. అందులో ఈ సినిమాలు ఎంతోమందికి ఇష్టం.. అలానే అల వైకుంఠపురములో, సన్నాఫ్ సత్యమూర్తి, ఖలేజా వంటి సినిమాలు ఉన్నాయి. కానీ మనం టాప్ 5 అన్నం కదా! అందుకే ఈ సినిమాలు చెప్పం. 

మరింత సమాచారం తెలుసుకోండి: