పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే.. ఆయన సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ కూడా కళకళలాడుతుంది. సినిమా హిట్టా ప్లాపా కాదు పవన్ సినిమా వచ్చింది అంటే ప్రేక్షకుల్లో ఒక తెలియని ఉత్సాహం మొదలవుతుంది. తను చేసిన పాతిక సినిమాలతో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్  తన కోరికను ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి ముందు బయట పెట్టాడు. అదేంటి అంటే ఒకరోజు షూటింగ్ కోసం రెడీ అవుతున్న పవన్ కార్ వ్యాన్ లో ఉండగా ఆయన అసిస్టెంట్ ద్వారా కబురు పంపించి పవన్ కళ్యాణ్ ను కలిశాను.. షాట్ కు రెడీ అవుతున్న పవన్ తో కొద్దిసేపు మాట్లాడి తన నాలోన శివుడు గలదు సిడి ఇచ్చి వచ్చాను. 

 

ఆ మరుసటి రోజు మళ్ళీ షూటింగ్ స్పాట్ లో పవన్ అసిస్టెంట్ తనని పిలుస్తున్నారని చెప్పగా వెళ్లి కార్ వ్యాన్ లో ఎంటర్ అయ్యాను. ఆలా వెళ్ళానో లేదో లేచి చేతులు చాచి కౌగిలించుకున్నారట పవన్ కళ్యాణ్. సిడి విన్నాక నిద్ర పట్టలేదని.. ఏదో ఒక్క భావన కలిగిందని తనికెళ్ళ భరణితో చెప్పారట పవన్ కళ్యాణ్. చాలా బాగా సిడి రూపొందించారని మెచ్చుకుని తాను శివ భక్తుడిగా చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తానని అన్నారట పవన్ కళ్యాణ్. పవన్ తో ఈ సంఘటన తన లైఫ్ లో మర్చిపోనని చెప్పారు తనికెళ్ళ భరణి. 

 

పవన్ కళ్యాణ్ శివ భక్తుడిగా నటిస్తాడో లేదో తెలియదు కానీ ఆయన్ను అంతగా ప్రిపేపించేలా చేసినందుకు రచయితగా, భక్తుడిగా సంతోషపడ్డారు తనికెళ్ళ భరణి. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: