యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు అన్ని చూసేయచ్చు.. అయినా అయన తీసిన సినిమాలలో కేవలం టాప్ 5 ఎలా చెప్పగలం.. అయన సినిమాలు అన్ని అద్భుతాలే.. సరే లెండి.. జనాలు మెచ్చిన టాప్ 5 సినిమాలు ఏంటో చూద్దాం.. ఈ లాక్ డౌన్ లో బోర్ కాకుండా ఎంజాయ్ చేద్దాం.. 

 

టాప్ 5 ఎన్టీఆర్‌ సినిమా.. అరవింద సామెత 

 

అరవింద సామెత.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో పూర్తయ్యింది. గొడవలు వద్దు.. అందరూ కలిసిమెలసి ఉండండి.. ఎన్ని తలలు తేగల.. అరవింద కనువిప్పు కలిగిచిన్నట్టు వచ్చే డైలాగులు సూపర్ అంటే సూపరు. 

 

టాప్ 4 ఎన్టీఆర్‌ సినిమా.. టెంపర్ 

 

ఒక అమ్మాయిని అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నీచులకు ఎంత దారుణంగా శిక్ష వెయ్యాలో చూపించిన సినిమా ఇది.. ఈ సినిమా అంత ఇంకా నిర్భయ స్టోరీ అనే చెప్పాలి.. చివరి వరుకు సస్పెన్స్ ఏ.. ఎం అవుతూంది.. ఎం అవుతుంది అనే టెన్షన్ ఏ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్ని సార్లు అయినా చూడచ్చు. 

 

టాప్ 3 ఎన్టీఆర్‌ సినిమా.. బృందావనం 

 

బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే.. అంటూ తీసిన ఈ సినిమా సూపరు.. రిలేషన్స్ అన్నింటిని చాలా చక్కగా చూపించారు అంటే నమ్మండి.. ఈ సినిమాను చూస్తే అదో ఫీల్ అంతే.. 

 

టాప్ 2 ఎన్టీఆర్‌ సినిమా.. నాన్నకు ప్రేమతో  

 

నాన్నకు ప్రేమతో.. సినిమా టైటిల్ ఓ ఏది ఉందో అదే సినిమాలో కూడా ఉంటుంది.. కాకపోతే సుకుమార్ కాస్త ఫిక్షన్ యాడ్ చేసి అన్ని ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి అని నీట్ గా చూపించాడు.. ఇంకా ఈ సినిమాలో ప్రేమ.. పగ.. యాక్షన్ అన్ని ఓ రేంజ్ లో ఉంయాయువు అంటే నమ్మండి. 

 

టాప్ 1 ఎన్టీఆర్‌ సినిమా.. జనతా గ్యారేజ్  

 

సమస్య వస్తే చెప్పుకోడానికి ఒకరు ఉంటారు.. వాళ్ళు మన సమస్యను క్లియర్ చేస్తారు అనే నమ్మకమే జనతా గ్యారేజ్.. అంతేకాదు.. ఈ జనతా గ్యారేజ్ లో చెట్ల గురించి.. పర్యావరణం గురించి ఎంత బాగా చెప్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ లో ఇది ఒక సినిమా.. 

 

ఎన్టీఆర్ సినిమాలు ఇవి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి.. స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ, అశోక్, సింహాద్రి, అది ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి.. కానీ మనం కేవలం 5 టాప్ ఫిల్మ్స్ అన్నము కాబట్టి.. మళ్లీ మళ్లీ చుసిన బోర్ కొట్టని సినిమాల గురించి ఇక్కడ రాశాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: