లాక్ డౌన్ తో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తీస్తున్న మూవీ ఆగిపోవడంతో పూరీ జగన్నాథ్ ఖాళీగా ఉండి తన పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ నిన్న ‘బద్రి’ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తన జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. వాస్తవానికి తన మొదటి మూవీ అందరు అనుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ ‘బద్రి’ కాదని 1996లో సూపర్ స్టార్ కృష్ణ తో తాను ఒక సినిమా మొదలుపెట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆమూవీ మధ్యలోనే ఆగిపోయిన అప్పటి విషయాలను బయటపెట్టాడు.

 

ఇదే సందర్భంలో పూరీ మాట్లాడుతూ తాను టాప్ యంగ్ హీరోలు అందరితోను సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నా తనకు సీనియర్ హీరోలలో చిరంజీవి వెంకటేష్ లతో సినిమాలు చేయలేదు అన్న అసంతృప్తి తనకు ఇప్పటికీ వెంటాడుతోంది అని అంటూ గతంలో రాజమౌళి తనతో చేసిన జోక్ గుర్తుకు చేసుకున్నాడు. సినిమాలు చాలవేగంగా చేసే తన తీరు ఇండస్ట్రీలోని అందరికీ తెలిసిన విషయం కావడంతో ఒకసారి రమా రాజమౌళి తన భర్త జక్కన్న తో సినిమాలు వేగంగా తీయడం ఎలా అనే విషయం పూరీ జగన్నాథ్ దగ్గర నేర్చుకోవచ్చు కదా అని సలహా ఇచ్చిన విషయాన్ని రాజమౌళి ఒక ఫిలిం ఫంక్షన్ లో ఓపెన్ గా చెప్పినప్పుడు ఆప్రశంసలు విని తాను ఎంతో ఆనంద పడ్డ విషయాన్ని మళ్ళీ గుర్తుకు చేసుకున్నాడు.

 

ఇదే సందర్భంలో పూరీ మాట్లాడుతూ తనకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా గోడకు కొట్టిన బంతిలా పైకి లేస్తూనే వచ్చిన విషయాన్ని వివరిస్తూ ప్రస్తుతం విజయ్ దేవరకొందతో చేసిన ‘ఫైటర్’ మూవీ అందరి అంచనాలను అందుకుంటుంది అని అంటున్నాడు. అయితే సినిమాలు వేగంగా తీస్తాడు అని పేరున్న పూరీ తన తీరుకు భిన్నంగా తన లేటెస్ట్ మూవీని చాల స్లోగా తీస్తూ ఉండటంతో పూరీలో కూడ భయాలు పెరిగిపోతున్నాయి అని ఎవరికైనా అనిపిస్తుంది. 

 

రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ తన దగ్గర ఉన్న ‘జన గణ మన’ సబ్జక్ట్ ను ఆధారంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాలకృష్ణ ఇలా ఎవరో ఒకరు టాప్ హీరోతో ఈ సినిమా తీయాలి అని కలలు కంటున్న పూరీ ఆశలు త్వరలోనే తీరే రోజులు వస్తాయి అనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: