స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ఎంత సూపర్ ఓ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయన సినిమాలు ప్లాప్ అయినా హిట్ అయినా ఒకటే ఎందుకంటే? ప్లాప్ అయినవి మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.. హిట్ అయినవి అవే చూడాలి అనిపిస్తుంది.. అంతే తేడా. అంటే అర్ధం అంత బాగుంటాయి సినిమాలు.. లాక్ డౌన్ లో మళ్లీ మళ్లీ చూడాలనిపించే అల్లు అర్జున్ సినిమాలలో టాప్ 5 యేవో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

టాప్ 5 అల్లు అర్జున్ సినిమా.. రేసుగుర్రం

 

నిజం కదా! అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్ కూడా ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలి అనుకుంటాడు.. అంత బాగుంటుంది ఈ సినిమా.. స్పందన లేని స్పందన.. అన్న ప్రేమ.. తల్లి ఆప్యాయత.. అబ్బో ఒకటి ఏంటి? అన్ని అద్భుతమే.. పిచ్చ కామెడీతో ప్రేమ పగలతో అన్న తమ్ముల అనుబంధంతో యాక్షన్ సినిమా రేసుగుర్రం.. సినిమా అదరహోనే.. లాక్ డౌన్ లో ఈ సినిమా చూశారు అంటే కిల్ బుల్ పాండే లా ఎగిరిగంతేస్తారు.. 

 

టాప్ 4 అల్లు అర్జున్ సినిమా.. హ్యాపీ 

 

హ్యాపీ సినిమా ఎంత బాగుంటుంది.. పెంటయ్య.. కాంతమ్మ సీన్స్ ఎంత బాగుంటాయి అండి.. అలాంటి సినిమాను ప్లాప్ చెయ్యడానికి మనసు ఎలా వచ్చింది అండి ? నిజంగా ఆ సినిమా ప్లాప్ అయ్యింది అంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నా.. అయినా కూడా ఆ సినిమాను మళ్లీ మళ్లీ ఫ్యామిలీతో కూర్చొని చూడాలి అనిపించే సినిమా ఇది. 

 

టాప్ 3 అల్లు అర్జున్ సినిమా.. సరైనోడు 

 

అల్లు అర్జున్ అంటే ఎవరు అండి ? స్టైలిష్ స్టార్ కదా! కానీ బోయపాటి అల్లు అర్జున్ ని మాస్ గా చూపించాడు.. దీంతో స్టైలిష్ అభిమానులు అంత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అనుకోండి.. అయినప్పటికీ ఈ సినిమాతో మాస్ అభిమానులకు దగ్గరయ్యాడు అల్లు అర్జున్. 

 

టాప్ 2 అల్లు అర్జున్ సినిమా.. అల వైకుంఠపురములో 

 

అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం 'అల.. వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాసంక్రాంతి సూపర్ హిట్.. నిజంగానే ఈ సినిమా అద్భుతం అంటే నమ్మండి.. ఇది ఇప్పుడే టీవీలో రాదు.. ఆన్లైన్ స్ట్రీమింగ్ లోను ఉండదు.. కానీ సినిమా అద్భుతం అంటే నమ్మండి. ఏమైతేనేం ఈ సినిమా ఓ అద్భుతం. 

 

టాప్ 1 అల్లు అర్జున్ సినిమా.. జులాయి 

 

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంత క్లాస్ గా.. ఎంత మాస్ గా.. ఎంత లవబుల్ గా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసిన చూడాలి అనిపిస్తుంది అంటే నమ్మండి.. ఈ లాక్ డౌన్ లో మంచి టైం పాస్ అయ్యే సినిమా ఇది. 

 

ఈ సినిమాలు మాత్రమే కాదు అనుకోండి.. ఇంకా చాలా ఉన్నాయి.. బన్నీ.. పరుగు, ఆర్య, ఆర్య 2, సన్నాఫ్ సత్యమూర్తి, గంగోత్రి, దేశముదురు, ఇద్దరమ్మాయిలతో ఇలా అన్ని సినిమాలు.. చెప్తున్నా కదండీ! అల్లు అర్జున్ సినిమాలు అన్ని మళ్లీ మళ్లీ చూడచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: