ఈ ఏడాది ఆస్కార్ అవార్డు గెలుచుకుని అందరి దృష్టి ఆకర్షించిన కొరియన్ చిత్రం పారసైట్. ఒక కొరియన్ సినిమా నాలుగు ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం ఇదే ప్రథమం. దీంతో ప్రపంచ సినిమా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆస్కార్ అవార్డ్ వచ్చేంత సినిమాలో ఏముందా అన్న ఆసక్తితో అమ్దరూ ఎగబడి చూశారు. ఆ టైమ్ లో పారసైట్ ట్రెండింగ్ లో నిలిచింది.

 

 

అయితే సినిమా చూసిన చాలా మంది ఈ సినిమాకి అస్కార్ వచ్చేంత సీన్ లేదని తేల్చి పారేశారు. అలాగే మరికొంతమంది నిజంగా ఈ సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. అవార్డు వచ్చిన సినిమాలు అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఏ సినిమాకైనా ఈ రూల్ వర్తిస్తుంది. అయితే సామాన్య జనాల మాటెలా సినీ రంగంలో ఉన్న వారికైన సినిమాలో విశేషం ఏముందో తెలుస్తుంది.

 

 

బాహుబలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు రాజమౌళి మాత్రం పారసైట్ మూవీపై తన అభిప్రాయాన్ని డిఫరెంట్ గా చెప్తున్నాడు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని చూద్దామని స్టార్ట్ చేశాడట. ముందుగా కొంచెం స్లోగా అనిపించిందట. అలాగే చూసుకుంటూ వెళ్తూ,వెళ్తూ నిద్రలోకి జారుకున్నారట. ఆస్కార్ అవార్డు సినిమ చూస్తూ నిద్రలోకి జారిపోవడం అందరికీ షాకింగ్ కలిగించే అంశమే.

 

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై అందరికీ భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరికి బాగా నచ్చింది మరికొందరికి అస్సలు నచ్చలేదు. అంతెందుకు ప్రతీ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చాలని లేదు. కాబట్టి రాజమౌళికి నిద్రరావడంలో వింతేమీ లేదని అంటున్నారు. రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆయన చిత్రం మహేష్ తో ఉంటుందని చెప్పేశాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ సినిమా అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: