లాక్ డౌన్  సమయంలో రెండు మూడు రోజుల వరకు ఫ్యామిలీతో గడపడం  హాయిగా టీవీ చూడడం లాంటివి అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం రోజూ ఇంట్లో కూర్చుని బోర్ గా ఫీల్ అవుతున్నారు. కనీసం బయటికి వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో... ఇంటి నుంచి కాలు బయట పెడితే పోలీసులు కాస్త లాటి రుచి చూపిస్తుండడంతో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది ఎంతో బోర్ గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి బోరింగ్ టైం లో మనకు నచ్చిన హీరోలు సినిమాలు చూస్తే ఎంతో బాగుంటుంది. నచ్చిన హీరోలు సినిమాలు అంటే విడుదలైనప్పుడు చూసి ఉంటాం ఇక ఇప్పుడు ఎందుకు అంటారా.... అయితే ఎన్ని సినిమాలు చూసినప్పటికీ మనకు నచ్చిన హీరోలు సినిమాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు చాలానే ఉంటాయి. అలాంటి సినిమాలను లాక్ డౌన్ సమయంలో చూసి తెగ ఎంజాయ్ చేయొచ్చు. 

 ఇలా లాక్ డౌన్  సమయంలో చూడాల్సిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన టాప్ ఫైవ్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

 టెంపర్ : జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న టెంపర్ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పండించే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది . అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అయితే అందర్ని ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా అప్పుడే కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

 

 యమదొంగ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యమదొంగ. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆయన కామెడీ టైమింగ్ తో ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోక  మానరు. అందుకే లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి హాయిగా చూస్తే ఎంతో బాగుంటుంది.

 

 అరవింద సమేత : ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా అరవింద సమేత. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా అంతే ఆసక్తికరంగా సాగుతుంది. అదే ఈ సినిమా ఆల్రెడీ చూసేసాను కదా అనే ఫీల్ ఎక్కడా కలగదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు కళ్లార్పకుండా చేస్తోంది. ఈ సినిమాలో కథ పాటలు నేపథ్యం అని బాగుండడంతో ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. ఇక ఈ సినిమాలో కామెడీ ఎంతగా ఉంటుందో యాక్షన్ అంతకుమించి అనే విధంగా ఉంటుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

 

 జనతా గ్యారేజ్ : ఈ సినిమా కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుందిm ప్రకృతిని కాపాడేందుకు ఎన్టీఆర్ చేసే యాక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది అదేవిధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రేక్షకులు అందరిని ఆకట్టుకునే విదంగా ఉంటాయి.  ఈ సినిమాలో అందుకే ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు.

 

 జై లవకుశ : ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సారి త్రిపాత్రాభినయం చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మూడు పాత్రల్లో నటించే ఎన్టీఆర్ తనదైన నటనతో  ఎంతగానో అలరిస్తాడు . ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు.

 

 .

మరింత సమాచారం తెలుసుకోండి: