దేశంలో ఇప్పుడు కరోనా రక్కసిని తరిమి కొట్టేందుకు గత నెల 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  లాక్ డౌన్ కారణంగా మద్యంషాపులు, మాల్స్,  థియేటర్లు, బార్లు, రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ చేశారు.  కరోనా ఇంకా కట్టడి కాకపోవడంతో లాక్ డౌన్ మే 3 వరకు పెంచుతున్నట్టు ఈ మద్య ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.  తాజాాగా లాక్ డౌన్ కారణంగా మద్యం ప్రియులు నానా కష్టాలు పడుతున్నారు.  కొన్ని చోట్ల మద్యం బానిసలు చేస్తున్న పిచ్చిపనులకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  మరికొన్ని చోట్ల పిచ్చివారైపోతున్నారు. 

 

అయితే మద్యం కోసం ఎంత డబ్బు అయినా ఇచ్చి కొనేందుకు సిద్ద పడుతున్నారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో, ఒక్కో క్వార్టర్ మద్యాన్ని రూ. 1,200కు అమ్ముతున్న,  బీరు రూ.400 నుంచి 500 వరకు అమ్ముతున్నారు.  దీన్ని క్యాష్  చేసుకునేందుకు జూనియర్ ఆర్టిస్ట్ ప్రయత్నించి జైలు పాలయ్యాడు.  చెన్నైలోని ఎంజీఆర్ నగర్ పరిధిలోని అన్నా మెయిన్ రోడ్డులో ఓ ఇంట మద్యం విక్రయాలు సాగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు మెరుపుదాడి చేశారు. అక్కడ కోలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న రిస్కాన్ (30) అనే యువకుడిని అరెస్ట్ చేశారు.

 

అయితే తన స్నేహితుడి వద్ద  రూ. 1000కి క్వార్టర్ కొని, తాను రూ. 1,200కు అమ్ముతున్నానని పోలీసుల విచారణలో రిస్కాన్ వెల్లడించాడు. లాక్ డౌన్ సమయంలో ఇలాంటి నేరాలకు పాల్పపడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా తమిళనాడులో 1,520 నమోదు అయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: