రావు రామేష్.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. ప్రముఖ నటుడు రావు గోపాలరావు నట వారసత్వాన్ని పుచ్చుకొని టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రావు రామేష్ ప్రతిభవంతులైన నటుల్లో ఒక‌రు అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. సినిమాలను హీరోలు మాత్రమే నడిపించే రోజులు పోయాయి. సరైన సహాయ నటులు ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తోంది. అయితే స‌హాయ న‌టుల్లో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే  సినిమా మొత్తాన్ని తమ భుజస్కందాలపై మోయ‌గ‌ల‌రు. అలాంటి వారిలో రావు రామేష్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు.

 

ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ ఇటీవ‌ల విడుద‌లైన ప్రతిరోజూ పండగే సినిమా అనిచెప్పుకోవ‌చ్చు. సినిమాలో రావు రమేష్ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమాకు ఫస్ట్ హీరో సాయి తేజ్ అయితే.. రెండో హీరో రావు రమేష్. సినిమాను ఎమోషనల్‌గా, సెంటిమెంటల్‌గా, కామెడీ పరంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తాన్ని రావు రమేష్ తీసుకున్నారంటే అతిశయోక్తికాదు. ఈ సినిమానే కాదు.. ప్ర‌తి సినిమాలోనూ తాను హీరో కాక‌పోయినా.. హీరో స్థాయిని మించి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటారు. అలాంటి టాలీవుడ్ హీరో కాని హీరో రావు రామేష్ నేడు(21-04-2020) పుట్టిన రోజు జ‌రుపుకుంన్నారు.

 

ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, ఆయన్ను తెలుగు ప్రజల్లోకి తండ్రి ప్లేస్ లోకి తీసుకెళ్ళి కూర్చో పెట్టాయి. ఇప్పటికే దాదాపు అందరు అగ్రహీరోల సినిమాల్లో నటించిన ఆయనకు ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్ప‌ర్చుకున్నారు. బాలయ్య అప్పుడెప్పుడో నటించిన సీమసింహం సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావు ర‌మేష్‌కు‌.. కొత్త బంగారులోకం, గమ్యం సినిమాలు మాత్రం గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఆ త‌ర్వాత ప్రతినాయకుడిగా, హీరోయిన్‌ తండ్రిగా, చదువుచెప్పే లెక్చరర్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో తన విలక్షణ నటనతో పేరు సంపాదించుకున్న రావు ర‌మేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. ఈయ‌న‌ మ‌రిన్ని విజ‌యాలు అందుకుంటూ ముందుకు సాగాల‌ని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: