దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. పలు ప్రాంతాలలో కరోనా భారీన పడిన వారికి చికిత్స అందిస్తున్న వైద్యులకు కరోనా సోకుతోంది.. పలు ప్రాంతాలలో వైద్యులు సైతం కరోనా భారీన పడి మృతి చెందుతున్నారు. కరోనా భారీన పడి ఎవరైనా మృతి చెందితే వారి దహన సంస్కారాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
 
చాలా ప్రాంతాలలో కరోనా సోకిన వారి ఖననానికి ఆయా ప్రాంతాల ప్రజలు అంగీకరించడం లేదు. వారి మృతదేహం వల్ల తమ గ్రామాలకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ శవాలను కాల్చకుండా అడ్డుకుంటున్నారు. ఇలా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న వారిపై ప్రముఖ సినీ నటి, హోస్ట్, నిర్మాత ఖుష్బూ మండిపడ్డారు. ఈరోజు ఖుష్బూ అలా దహన సంస్కారాలను అడ్డుకుంటున్న వారిపై ఘాటుగా స్పందించారు. 
 
ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతాలో మన కోసం మనం ఏం చేస్తున్నామని ప్రశ్నించారు. సమాజంలో మనతో పాటు తోటి జీవులను కాపాడటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు గౌరవప్రదమైన వీడ్కోలు కూడా అందించలేకపోతున్నామని చెప్పారు. సమాజంలోని నిరక్ష్యరాస్యులు, గూండాలు, మూర్ఖుల వల్లే ఇలా జరుగుతోందని అన్నారు. ఇలాంటి సమాజంలో నివశిస్తున్నందుకు మనం సిగ్గు పడాలి అన్నారు. 
 
దేశంలోని చాలా ప్రాంతాలలో కరోనా మృతుల అంత్యక్రియలను ప్రజలు అడ్డుకుంటున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే కరోనా సోకిన వారి నుంచి వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందదు. సాధారణంగా వైద్యులు కరోనా వల్ల రోగి చనిపోతే హైపోక్లోరైడ్ అనే ద్రావణం ద్వారా వైరస్ ను చంపుతారు. ఆ తరువాతే మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో ప్యాక్ చేస్తారు. అందువల్ల కరోనా సోకిన వారి మృతదేహాల అంత్యక్రియలను అడ్డుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: