క్రియేటివ్‌ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ 20 ఏళ్ళ కెరియ‌ర్‌ని పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా అత‌ని ప్రాణ స్నేహితుడైన రఘుకుంచె ట్విట‌ర్‌లో వారిద్ద‌రి స్నేహం గురించి అలాగే ద‌ర్శ‌కుడు పూరి గురించి కొన్ని విష‌యాల‌ను ట్విట‌ర్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ‌ద్రీ చిత్రం విష‌యంలో పూరి ప‌డిన టెన్ష‌న్ అలాంటి ఇలాంటి టెన్ష‌న్ కాదు ఆ సినిమా కోసం ఆయ‌న చాలా ఇబ్బందులు ప‌డ్డార‌న్నారు. బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా భోళా శంకరుడు అని ఖచ్చితంగా చెప్పాలసిందే. అసలు కథలన్ని ఒక్కటే తీసే విధానంలోనే ఆ డైరెక్టర్ క్రియోటివిటి ఉంటుందని. ఇది ముమ్మాటికి నిజం. ఇక పూరి హీరోలు యమా యారగంట్ గా ఉంటారంటే .. హీరో అనే వాడు అలానే ఉండాలనేది ఆయన సమాధానం. 

 

ఓ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ద్రీ సినిమా కోసం తెల్ల‌వారు జామున నాలుగంట‌ల‌కు ప‌వ‌న్‌ ద‌గ్గ‌ర‌కు క‌థ చెప్ప‌డానికి వెళ్ళారు పూరి. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ నేను ఒక అర‌గంటసేపు క‌థ వింటాను నాకు న‌చ్చితే ఓకే లేదంటే అత‌ను వ‌చ్చి డోర్ క్లోజ్ చేస్తాడు అని చెప్పారు. దానికి పూరి స‌రే అని అన్నాడు. పూరి మొద‌టిసారి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు కెమెరామెన్ చోటాకె నాయుడు ద్వారా పూరి వెళ్లి క‌థ‌ చెప్పాడు. నాలుగు గంట‌ల‌కు మొద‌లు పెట్టిన క‌థ నెమ్మ‌దిగా అర‌గంట.. అర‌గంట‌..చెపుతూ ఉండ‌గా ఎనిమిద‌యింది. కథ మొత్తం విన్నాక ప‌వ‌న్ స్టోరీ మొత్తం ఓకే బ‌ట్ క్లైమాక్స్ కొంచం మారిస్తే బావుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చాడు. క్లైమాక్స్ మార్చి మ‌ళ్ళీ వ‌చ్చి చెప్ప‌మ‌న్నాడు. దాంతో పూరి తిరిగి వెళ్ళి ఆ లైన్ని మ‌రి కాస్త ఎలాబ్రేట్‌గా రాసుకుని వెళ్ళి తిరిగి అదే క్లైమాక్స్‌ని ఇంకాస్త అర్ధ‌మ‌య్యేట‌ట్టు చెపుతాడు. దానికి ప‌వ‌న్ క్ల‌మాక్స్ ఏమీ మార్చ‌లేదుక‌దా అదే చెప్పావు క‌దా అన్నారు. దీనికి క్ల‌యిమాక్స్ ఇంతే ఉంటుంది. మారిస్తే బావుండ‌దు అంటాడు దాంతో ప‌వ‌న్ నా ఇమేజ్‌ని మైండ్‌లో పెట్టుకుని నువ్వు క్ల‌యిమాక్స్ మారుస్తావు అనుకున్నాను. కానీ నువు క్ల‌యిమాక్స్ మార్చ‌లేదంటే నీమీద నీకున్న న‌మ్మ‌కం అలాగే ఉంచావు కాబ‌ట్టి మ‌నం ఈ సినిమా ఖ‌చ్చితంగా చేద్దా అన్నాడంట‌.  వెంట‌నే ప్రొడ్యూస‌ర్ త్రివిక్రమ్‌రావ్ ద‌గ్గ‌ర‌కి పంపిచాడు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: