తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంతో మంది ద‌ర్శ‌కులు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎంతోమంది యంగ్ జ‌న‌రేష‌న్ వ‌స్తున్నారు. అయితే ఈ 20 ఏళ్ళ‌లో ఎంత మంది వ‌చ్చినా వెళ్ళినా..పూరి స్టైలే వేరు దాంతో నేను లోక‌ల్ అన్న‌రేంజ్ ఉంటారు. ఒక పూరి సినిమా తీసే స్పీడ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఆ విష‌యంలో మాత్రం ఒక రాకెట్ స్పీడ్‌లో ఆయ‌న సినిమాల‌ను తీస్తారు. ఓ క‌థ కొత్త‌గా రాయాల‌న్నా..ఒక హీరోని కొత్త స్టైల్లో చూపించాల‌న్నా పూరి త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్పాలి. హీరో ఎవ‌రైనా స‌రే త‌న టార్గెట్ మాత్రం సినిమాని మాత్రం కేవ‌లం 90 రోజుల్లోనే పూర్తి చేస్తాడు పూరి. అంత‌కు మించి ఎక్కువ స‌మ‌యం మాత్రం తీసుకోడు. ఇక పూరి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సెల‌బ్రెటీలంద‌రూ ఆయ‌న‌తో ఉన్న బంధాన్ని ఒకొక్క‌రూ ఒక్కోరూపంలో ఆయ‌న పై త‌మ ట్విట‌ర్ ఖాతాల ద్వారా తెలుపుతున్నారు. మ‌రి ప్రాణ‌స్నేహితులైన ర‌ఘుకుంచె పూరి గురించి వాళ్ళ స్నేహం గురించి ఏమి చెప్పారో ఓ సారి చూద్దాం...

 

ఈ 20 ఏళ్ళ సినీ ప్ర‌యాణంలో ఎన్నో మార్పులు, చేర్పులు వ‌చ్చాయి. ఎంతో టెక్నాల‌జీ పెరిగింది. క‌థ‌ల‌లో.. న‌టుల‌లో ద‌ర్శ‌కుల్లో అదే విధంగా సినిమాని చూసే ప్రేక్ష‌కుడిలో కూడా మార్పులు వ‌చ్చాయి. కానీ మ‌నిద్ద‌రిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. మ‌న స్నేహం ఎప్ప‌టిలాగానే అలానే ఉంది. కేవ‌లం నువ్వు నేను మాత్రం మార‌లేదు మిత్ర‌మా అంటూ ట్వీట్ చేశాడు ర‌ఘు పూరి గురించి. అలాగే మ‌నం ఎప్ప‌టికీ ఇలానే ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్నారు. విజ‌యాల్ని అప‌జ‌యాల్ని ఒకేలా చూడ‌గ‌లిగే ద‌మ్మున హృద‌యం నీది అన్నారు. ఇలాగే మ‌ర‌రో 20 ఏళ్ళ పాటు సినిమాని ప్రేమించ‌రా అంటూ శుభాకాంక్ష‌లు స్నేహితుడా అంటూ ఎంతో ప్రేమ‌తో అభిమానంగా ర‌ఘు త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా ఈ  ట్వీట్ ని పోస్ట్ చేశారు. ఈ విధంగా పూరి పై ఉన్న అభిమానాన్ని ఆయ‌న ఎనిమిది పేజీలల్లో త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే అన్న‌ట్లు చెప్పారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: