కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా సెలెబ్రెటీలు అందరూ ఇంటి పట్టునే ఉండి కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్లో 'బీ ది రియల్ మ్యాన్' అనే ఛాలెంజ్ విస్తృతంగా సాగుతుంది. సందీప్ రెడ్డి వంగా మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్ జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరింది. లాక్డౌన్ వేళ సేవకులు పనికి దూరం కావడంతో ఇంట్లో వారికి చేదోడు వాదోడుగా తాము పని చేస్తున్నామని చెబుతున్నారు మన సినీ సెలబ్రిటీలు. వాస్తవానికి ఇంటి పనులు చేసేవారు అందుబాటులో లేని లాక్డౌన్ సమయంలో సెలబ్రిటీలకు నిజంగా ఇది సవాలు లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇంటి పనులలో భాగస్వాములవడం అనేది వారికి సాధ్యమైన పనిగా అనిపించదు. సెలెబ్రెటీలు ఈ సవాలును స్వీకరించి ఇంటి పనులలో మునిగితేలుతూ ఉంటే ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన ఛాలెంజ్ అని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన ఎన్టీఆర్ తాజాగా వీడియో షేర్ చేశాడు.
ఎన్టీఆర్ 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అవుతూ మరింత ఊపునిచ్చే వీడియోను విడుదల చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఖాళీగా ఇంట్లో ఉన్న భర్తలు.. తమ భార్యలకు సాయం చేయాలని అతనే రియల్ మ్యాన్ అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘బీ ది రియల్ మ్యాన్’ అనే ఛాలెంజ్ కు దర్శకుడు రాజమౌళిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన రాజమౌళి తన భార్యకు ఇంటి పనుల్లో సాయం చేస్తూ చీపురు పట్టి ఇల్లు ఊడుస్తూ.. డోర్స్ క్లీన్ చేసిన వీడియోను సోషల్ మీడియాల షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటుగా సుకుమార్, కీరవాణి, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు ఛాలెంజ్ విసిరారు జక్కన్న. కాగా 'ఛాలెంజ్ సీకరిస్తున్నా జక్కన్న' అంటూ రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్.. నేడు ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇల్లు తుడుస్తూ.. వంట గిన్నెలు క్లీన్ చేస్తూ.. బయట చెత్తను తుడిచి శుభ్రం చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఎన్టీఆర్. ఈ వీడియోతో పాటు 'మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం'.. అంటూ సందేశాన్ని ఇస్తూ.. ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌కి తన బాబాయ్ బాలయ్య.. చిరంజీవి.. నాగార్జున బాబాయ్.. వెంకటేష్.. కొరటాల శివలను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా జూనియర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 'ఛాలెంజ్ యాక్సిప్టెడ్ తారక్.. అలాగే యువర్ పార్టనర్ చరణ్ ఇన్ క్రైమ్.. వీడియో కోసం వెయిటింగ్' అంటూ పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా దీనికి చిరంజీవివి నటించిన 'ఛాలెంజ్' సినిమా టైటిల్ పోస్టర్ ని జత చేసాడు. ఈ పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఇంట్లో పనులు చేసుకుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరి ఎలాంటి ఇంటి పనులతో వీడియో వదులుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మిగిలిన సీనియర్ హీరోలు ఈ ఛాలెంజ్ పై ఎలా స్పందిస్తారో అని ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు.
Challenge accepted @tarak9999 .. అలాగే your partner in crime @AlwaysRamCharan #betherealman వీడియో కోసం వెయిటింగ్... I am waiting https://t.co/hdiNd8ARKV pic.twitter.com/T7PM2Sgpck
— chiranjeevi konidela (@KChiruTweets) April 21, 2020