బాలయ్య ఎపుడూ కొత్తే.నిత్య నూతనమే. ఆయన వయసు పక్కన పెడితే ఆయన స్పీడ్,దూకుడు చూసిన వారు షాక్ తినాల్సిందే. యంగ్  హీరోలు సైతం ఒక సినిమా పూర్తి చేయడానికి ఎంతో టైం తీసుకుంటారు, కానీ బాలయ్య మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూనే ఉంటాడు.

 

ఆయన హిట్లొ  ఫట్లూ అసలు పట్టించుకోరు. సినిమా కధ నచ్చితే ఓకే అనేస్తారు. బయట ఏ ట్రెండ్ నడుస్తోంది. జనం ఎలా ఉన్నారు. అన్నది కూడా ఆయన విశ్లేషించుకోరు. కధ బాగుంటే, సినిమా బాగా వస్తే జనం తప్పక ఆదరిస్తారని బాలయ్య నమ్మకం. చాలా సార్లు అది రుజువు అయింది కూడా.

 

ఇక బోయపాటి,బాలయ్య అంటేనే హిట్ కాంబో, ఈ ఇద్దరూ కలసి  సింహా, లెజెండ్ తో ట్రెండ్ సెట్ చేశారు. ఇపుడు ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ మూవీతో కలుస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొంత జరిగింది. అయితే అనుకోకుండా కరోనా వైరస్ రావడంతో ఆగింది. ఇదిలా ఉండగా ఈ మూవీ అప్డేట్స్ గురించి బోయపాటి ఈ మధ్య వరసగా ఒక్కో విషయాన్ని బయటపెడుతున్నాడు.

 

తాజాగా ఆయన ఈ మూవీలో కొత్త బాలయ్యని చూస్తారని ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ ఇచ్చాడు. ఈ మూవీ యాక్షన్ మూవీ కాదని కూడా చెప్పుకొచ్చాడు. ఇక మంచి మేసేజ్ తో ఈ మూవీ ఉంటుందని కూడా ఆయన అంటున్నారు. ఇక బాలయ్య ఈ మూవీలో వేసే రోల్ ఓ ల్యాండ్ మార్క్ గా ఉంటుందని కూడా అంటున్నాడు.

 

ఈ మూవీలో హీరోయిన్ల విషయం కూడా బోయపాటి చెప్పాడు. సీనియర్ హీరోయిన్లు ఉండరు అంటూ హింట్ ఇచ్చారు. అంటే కొత్త హీరోయిన్లు బాలయ్య పక్కన ఉంటారన్న మాట. ఇది కూడా ఒక ట్రెండే. ఇప్పటిదాకా సీనియర్ హీరోలు సీనియర్ హీరోయిన్లతోనే చేస్తూ వచ్చారు. బాలయ్య కనుక కొత్త భామలతో ఆడిపాడితే రేపటి రఒజున ఆ ట్రెండ్ మిగిలిన వారు కూడా ఫాలో అయ్యే చాన్స్ ఉంది.

 

అలాగే సినిమా పరిశ్రమకు కొత్త హీరోయిన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తానికి అంతా కొత్త కొత్తగా తమ మూవీ ఉంటుందని బోయపాటి అంటున్నారు. హ్యాట్రిక్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: