మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'ఉప్పెన'. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు.

 

కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ తో పాటు రెండు లిరికల్ పాటలు వచ్చిన విషయం తెలిసిందే. అవి ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు అనుకున్నారు. దానికి తగ్గట్లే షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంది. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తర్వాత ఈ సినిమాను మే 7న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు ఇప్పుడప్పుడే అనుకూలించేలా కనపడకపోవడంతో మళ్ళీ డిసెంబ‌ర్ కి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారట.

 

అయితే 'ఉప్పెన' కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఉప్పెన ఓ విషాద వంతమైన ప్రేమ కథ అని.. అయితే ప్రేమలో విఫలమైన జంటగా మిగిలినప్పటికీ హీరోహీరోయిన్లు జీవితంలో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటారని.. సెకెండ్ హాఫ్ లో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. సాడ్ ఎండింగ్ చిత్రాలంటే వేరే విధంగా ఆలోచించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మరి మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న వైష్ణవ్ ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: