పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అంటే ఆ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. పవన్ సినిమా దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరన్నది చూడరు. పవన్ ను మాత్రమే చూస్తారు. టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ తో సినిమా అంటే ఏ డైరక్టర్ మాత్రం ఇంట్రెస్ట్ చూపడు చెప్పండి. వారిలో సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ కూడా ఉన్నాడు. పవన్ తో సినిమాకు మీరు రెడీ అంటే ఆయన సినిమా అంటే హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. పవన్ తో సినిమా చేయాలంటే ఆ ధైర్యం వేరేలా ఉంటుంది. అలాంటి కథ వస్తే తప్పకుండా ఆయన్ను కలుస్తా అంటున్నాడు. 

 

పవన్ తో సినిమా అంటే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉంటాయని ఆ అంచనాలకు తగినట్టుగా కథ రాస్తే తప్పకుండా వెళ్లి పవన్ కళ్యాణ్ ఇంటి డోర్ కొడతా అంటున్నాడు కొరటాల శివ. టాలీవుడ్ లో ఇప్పటివరకు ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసిన ఆయన పవర్ స్టార్ తో సినిమా అంటే స్పెషల్ గా ధైర్యం గురించి మాట్లాడటం విశేషం. పవన్ తో సినిమా అనగానే కొరటాల శివ చెప్పిన తీరు చూసి అందరు షాక్ అయ్యారు. 

 

అంతేకాదు బాహుబలి-2లో కూడా ఇంటర్వల్ సీన్ ను పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ చూసే ఆ సీన్ రాసినట్టుగా చెప్పుకొచ్చాడు. అంతగా పవన్ తనని ప్రేరేపించాడు. పవన్ కు ఉన్న క్రేజ్ ను చూసి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలవి. భాహుబలి 2 లో ఆ సీన్ చూసినప్పుడు పవన్ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతారు. అందుకే పవన్ రేంజ్ కథ రాసుకున్నప్పుడే ఆయన్ను కలుస్తా అంటున్నాడు కొరటాల శివ. 

మరింత సమాచారం తెలుసుకోండి: