న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అన్ని సినిమాలు బాగుంటాయి.. నిజానికి అయన సినిమాలు అన్ని వరుసగా వేసుకొని చూసేయచ్చు.. అయితే అంతలోపు లాక్ డౌన్ ఎత్తివేస్తారు కాబట్టి.. లాక్ డౌన్ లో చూడలిసిన నాని 5 టాప్ సినిమాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఇంట్లోనే చూసేద్దాం.. 

 

టాప్ 5 నాని సినిమా.. అలా మొదలైంది 

 

నిత్యామీనన్ హీరోయిన్ గా.. నాని హీరోగా నటించిన ఈ సినిమా అద్భుతం.. అలా మొదలైంది  ఇలా అంటూ వచ్చే ఈ సినిమాలో అన్ని రకాలుగా అద్భుతం అనే చెప్పాలి.. మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది ఈ సినిమా. ఇంతకంటే అద్భుతమైన సినిమా మరొకటి ఉంటుందా? 

 

టాప్ 4 నాని సినిమా.. నిన్ను కోరి 

 

నాని హీరోగా.. నివేద థామస్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎంతోమంది ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ కి ఆదర్శం.. ప్రేమించిన అమ్మాయి మరొకరిని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే అబ్బాయి జీవితం నాశనం కాకూడదు అని.. అమ్మాయి పడే తపన.. ప్రేమించిన అమ్మాయి మరొకరితో ఆనందంగా లేదు ఏమో అని బాధ పడే అబ్బాయికి లవ్ ఫెయిల్యూర్ తర్వాత కూడా ఒక అద్భుతమైన జీవితం ఉంటుంది అని చెప్పిన సినిమానే నిన్ను కోరి. 

 

టాప్ 3 నాని సినిమా.. భలే భలే మొగాడివోయ్

 

మతిమరుపు ఇంత డెంజర్స్ గా ఉంటుందా అనేది ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. బాబోయ్.. ఈ సినిమా అంత కామెడీగానే ఉంటుంది.. అంత కామెడీ అయినప్పటికీ.. అక్కడక్కడా కొంచం ఏమోషనల్ కి కూడా గురి చేస్తుంది అని అనుకుండి. ఎంత ఎమోషనల్ చేసిన మతిమరుపు వంటి రోగాలు కూడా ప్రేమిస్తే మాయం అయిపోతాయి అని ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది.. ఈ సినిమా కూడా లాక్ డౌన్ లో మంచి టైం పాస్. 

 

టాప్ 2 నాని సినిమా.. కృష్ణగాడి వీరప్రేమగాథ 

 

నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఒక ప్రేమ కథ 14 ఏళ్ళు ఎవరికి తెలియకుండా ఉండి.. సీక్రెట్ గా ప్రేమించుకుంటూ.. ప్రేమ పెళ్లే జీవితం అని వారి కళల సినిమానే ఇది.. ఇందులో ఒక్క ప్రేమే కాదు.. యాక్షన్, కామెడీ అన్ని కూడా అద్భుతమే. నిజంగానే ఈ సినిమా వీరప్రేమగాథే.. లాక్ డౌన్ లో మంచి టైం పాస్ ఈ సినిమా. 

 

టాప్ 1 నాని సినిమా.. గ్యాంగ్ లీడర్ 

 

ఇటీవలే రిలీజ్ అయినా ఈ గ్యాంగ్ లీడర్ నిజంగానే అద్భుతం.. ఐదుగురు ఆడవాళ్లు.. ఒక స్టైలిష్ విలన్.. ఒక డిటెక్టీవ్ హీరో.. ఇంకా అంతే.. సినిమా కథ అద్భుతం.. చూసే కొద్ది చూడాలి చూడాలి అని అనిపించే సినిమా ఇది.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈ సినిమాను లాక్ డౌన్ లో నాలుగు ఐయుదు సార్లు చుసిన తక్కువే. 

 

ఇవి నాని సినిమాల్లో కొన్ని మాత్రమే.. ఇంకా ఎన్నో ఉన్నాయి.. మీకు అనిపించినా టాప్ 5 సినిమాలు ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: