చిరంజీవి గారు శ్రీరస్తు అన్నారు... బాలకృష్ణ గారు శుభమస్తు అన్నారు...!


 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో డైలాగ్ రైటర్ పరచూరి గోపాలకృష్ణ గారు మీడియా ముఖంగా ఈ లాక్ డౌన్ ఎదుర్కోవడానికి ఇండస్ట్రీ  పెద్దలకు పిలుపునిచ్చారు. టాలీవుడ్ లో అప్పటి హీరోలు ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ లు రాష్ట్రంలో గానీ దేశంలో గాని ఏదేని విపత్తు సంభవించినప్పుడు ఎన్నో విధాలుగా ముందుండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి సినీ పెద్దలు ఇండస్త్రీని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ లోని ఆర్టిస్టులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మెగాస్టార్ చిరంజీవి గారు డొనేషన్ కలెక్షన్ చేశారు దీనికి బాలకృష్ణ గారు కూడా సంఘీభావం తెలిపారు అదేవిధంగా మోహన్ బాబు గారు కూడా ఈ కష్టకాలంలో ఆయనకు దగ్గర్లోనే ఉన్న ఓ మూడు గ్రామాలను దత్తత తీసుకుని నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.

 

తాజాగా వారి జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా చేరారు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి ముంబైలోని వలస కార్మికులకు అండగా నిలిచారు తమన్నా. 10వేల మంది వలస కూలీల కోసం 50 టన్నుల ఆహార పదార్థాలను తమన్నా సిద్ధం చేశారు. అదేవిధంగా టీవీ పరిశ్రమ నుంచి కూడా ఇండస్ట్రీ పెద్దలు  ఆర్టిస్టులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరోనా బారిన పడిన  వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లకు మరియు కరుణ సోకకుండా వీధులలో గస్తీ కాస్తున్నారు పోలీస్ సోదరులకు మరియు పారిశుద్ధ్య కార్మికు లను వారు చేస్తున్న గొప్ప పనులకు అభినందించారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీనే కాకుండా ఉపాధిని కోల్పోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని పరుచూరి బాలకృష్ణ యో ముఖంగా కోరారు....

మరింత సమాచారం తెలుసుకోండి: