ప్రేమ.. అంటే అదో మధురమైన అనుభూతి.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనంత తీయ‌గా ఉంటుంది.  ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ప్రేమలో పడితేనేగాని అది సాధ్యమని అంటాడొక మహానుభావుడు. నిజమే! తరాలు మారినా. కాలాలు మారినా ప్రేమ మారదు.. ఎప్ప‌టికప్పుడు కొత్త ప్రేమికులు పుట్టుకొస్తూనే ఉంటారు. ప్రేమించే మనుషులు మారొచ్చు కాని ప్రేమ ఎప్పటికీ అజరామరం. అందుకే సినిమాకు ప్రేమే కొలమానం.. ఎక్కువ శాతం సినిమాలు ప్రేమ‌కు సంబంధించిన‌వే ఉంటాయి. అలాంటి సినిమాలే ఎక్కువ హిట్ కొట్టాయి కూడా.  ఎన్ని జోనర్స్‌లో సినిమాలు వచ్చినా.. కూడా అందులో కామ న్ పాయింట్ మాత్రం ప్రేమనే తీసుకుంటాడు ఏ ద‌ర్శ‌కుడైనా. ప్రేమ లేని సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ప్రేమించిన ప్రతి ప్రేమికుడు తన ప్రియురాలిని దక్కించుకోకపోవచ్చు. కాని నిజ జీవితకాలంలో ఆ ప్రేమ జ్ఞాపకాలను మాత్రం మరచిపోలేడు. నిజ జీవితంలో ప్ర‌రేమించిన వ్య‌క్తి పెళ్ళి చేసుకుని జీవ‌నం సాగిస్తుంటే ఆ అనుభూతే వేర‌ని చెప్పాలి. ప్రేమ అద్భుతం.. అందుకే ఓ లైలా మజ్ను.. ఓ సలీం అనార్కలీ.. తమ ప్రేమ కోసం ప్రాణాల త్యాగం చేసిన రోజులున్నాయి. ప్రేమ విజయం దక్కినా... అపజయం ఎదురైనా రెండుకూడా అద్భుత‌మైన‌ జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. ‘ఇక ప్రేమలో విఫలమైన ప్రేమికుడు దేవదాస్ కాకపోవచ్చు కాని అతని వేదన ఎవరు వర్ణించలేరు.. అందుకే తన గుండె లోతుల్లో ఉన్న బాధను చెబుతూ.. ‘ప్రేమ లేదని ప్రేమించరాదని.. ఇలా ఎన్నో సినిమాలు.. పాట‌లు ఎన్నెన్నో వ‌చ్చాయి. 

 

ఇక తెలుగు పరిశ్రమలో ప్రేమలో పడి దాన్ని పెళ్లితో సాకారం చేసుకున్న స్టార్స్ చాలామందే ఉన్నార‌ని చెప్పాలి. వారిలో మొదటగా చెప్పుకోవలసింది నా టితరం సూపర్‌స్టార్స్ కృష్ణ- విజయనిర్మల. ఆ తరువాత ప్రముఖ నటుడు నాగార్జున-అమల, పవన్‌కళ్యాణ్ - రేణుదేశాయ్, మహేష్- నమ్రత నుండి లేటెస్టుగా పెళ్లిచేసుకున్న సమంత-నాగచైతన్యలవరకూ అందరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నవారే. అయితే వీటిలో కూడా కొన్ని బ్రేక‌ప్ అయిన‌వి ఉన్నాయి. ఇక ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రేణుదేశాయ్‌ల గురించి తీసుకుంటే వారిద్ద‌రూ పవన్‌కళ్యాణ్ ‘బద్రి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రేణుదేశాయ్‌తో ప్రేమలో పడ్డాడు. పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన అమ్మాయి రేణు.. మొదట మోడల్‌గానే తన కెరీర్ ప్రారంభించింది.

 

2000లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రంలో పవన్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే వారిద్దరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది.దాంతో వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. ఆ తరువాత పవన్ దర్శకుడిగామారి చేసిన ‘జాని’ సినిమాలో కూడా రేణు హీరోయిన్. ఆ తరువాత వారి ప్రేమ ముదిరి పాకాన పడింది. ఆ తరువాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అన్యోన్యంగా ఉంటున్న వీరు ఏవో మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌ల్ల‌ కొన్నాళ్ళకు ఇద్దరూ విడిపోవడం  జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: