పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 1999లో వచ్చిన సినిమా తమ్ముడు. పిఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యూత్ ని రిప్రెజెంట్ చేసే ఒక మంచి క్యారెక్టర్ పోషించిన ఆ సినిమాని బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించడం జరిగింది. ఇకపోతే ఆ సినిమాకు మ్యూజిక్ అందించింది రమణ గోగుల. వాస్తవానికి అంతకముందు విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రీతీ జింతా హీరోయిన్ గా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రమణ గోగుల, ఆ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ని అందించి శ్రోతల మనసు గెలుచుకున్నాడు. 

IHG

అయితే ఆ సినిమాలో అతడి పనితనం నచ్చిన పవన్, తన తమ్ముడు సినిమాకు అతడిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది. కాగా ఆయన అందించిన తమ్ముడు సాంగ్స్ అప్పట్లో శ్రోతల నుండి విశేషమైన స్పందన అందుకోవడం జరిగింది. దానితో తన తదుపరి సినిమా బద్రికి కూడా ఆయననే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్న పవన్, మరొక్కసారి తమ కాంబోలో అదరగొట్టే మ్యూజికల్ హిట్ ని అందుకున్నారు. ఆపై కొంత కొంత గ్యాప్ తీసుకున్న రమణ గోగుల, పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జాన్ సినిమాకు మ్యూజిక్ అందించి ఆ సినిమాలో కూడా సాంగ్స్ ని అదరగొట్టారు. 

 

ఇక దాని అనంతరం కొంత కాలం తరువాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ నటించిన అన్నవరం సినిమాకు మరొక్కసారి రమణ గోగులను తీసుకున్నారు పవన్. ఇక ఆ తరువాత తన సినిమాలకు రమణ గోగులను పవన్ రిపీట్ చేయలేదు. ఆపై ఇటీవల బోణీ, వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాల అనంతరం విదేశాల్లో స్థిరపడిన రమణగోగుల, ఇటీవల కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనకు పవన్ గారితో మంచి అనుబంధం ఉందని, మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికీ ఆ బంధం అలాగే కొనసాగుతుందని, ఎప్పుడైనా సరే పవన్ తన సినిమాకు అవకాశం ఇస్తే చాలు, మరొక్కసారి అదరగొట్టే మ్యూజిక్ ఇవ్వడానికి తాను సిద్ధం అని రమణ గోగుల చెప్పినట్లు తెలుస్తోంది. మరి పవన్ ఆయనకు ఎంతవరకు అవకాశం ఇస్తారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: