ఇటీవల టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ విషయమై పెద్ద వివాదాన్ని రేపిన వర్ధమాన నటి శ్రీరెడ్డి, సినిమా పరిశ్రమకు కొత్తగా వస్తున్న అమ్మాయిలను, ఇక్కడి సినిమా మేనేజర్లు, కో ఆర్డినేటర్లు కొందరు అవకాశాలు ఇప్పిస్తాం అని నమ్మబలికి మాయమాటలతో వారిని లోబరుచుకుని లైంగికంగా పలు ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని, తనకు కూడా అటువంటి పరిస్థి ఎదురైందని, అయితే వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, అలానే టాలీవుడ్ కి కొత్తగా వస్తున్న ఆడవారికి రక్షణ కల్పించే విధంగా ఏ మాత్రం మా అసోసియేషన్ వారు వ్యవహరించడం లేదని అప్పట్లో శ్రీరెడ్డి ఆరోపించడం జరిగింది. అయితే శ్రీరెడ్డి వాదన కరెక్ట్ కాదని, ఆమెను మొదట మా అసోసియేషన్ నుండి ఆర్టిస్ట్ గా తొలగించడం జరిగింది. 

 

అయితే ఆ ఘటన అనంతరం, జరుగుతున్న పరిణామాలను చూస్తూ కూడా వాటిపై చర్యలు తీసుకోకుండా తనను అసోసియేషన్ నుండి తీసేయడం అన్యాయం అని శ్రీరెడ్డి ఒకానొక సమయంలో మా అసోసియేషన్ ఆఫీస్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించింది. దానితో దిగివచ్చిన మా అసోసియేషన్ వారు, ఆమెను తిరిగి తీసుకోవడంతో పాటు ఆడవారి రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సిద్ధం అయ్యారు. దానితో ప్రజల్లో కొంత పాపులరైన శ్రీరెడ్డి, ఆ తరువాత పలువురు సినిమా ప్రముఖుల పై నిందారోపణలు చేసి వారి అభిమానుల ఆగ్రహానికి కూడా గురైంది. ఆ తరువాత నటుడు పవన్ కళ్యాణ్ పై కూడా ఘోర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, ఇటీవల తన మకాంని పూర్తిగా చెన్నై నగరానికి మార్చేసింది. అయినప్పటికీ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పలువురి పై పలు విధాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్న శ్రీరెడ్డి, ఇప్పటికీ పలువురు నెటిజన్ల నుండి కామెంట్ల రూపంలో విమర్శలను అందుకుంటూ ఉంది. 

 

కాగా నిన్న ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో కు మాత్రం ఆమెపై చాలావరకు పాజిటివ్ కామెంట్స్ ని తెచ్చిపెట్టడం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లలో ఉండిపోవడంతో బయట చాలా మూగజీవాలకు సరిగ్గా తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చెన్నై లోని కొందరు కార్మికులకు తనవంతుగా సాయం అందిస్తున్నట్లు చెప్పిన శ్రీరెడ్డి, నిన్నటి వీడియోలో తన ఇంటి చుత్తుప్రక్కల ఉన్న కొన్ని కుక్కలకు ఆహారం అందిస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. కాగా ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు, అబ్బబ్బా శ్రీరెడ్డి, ఈ ఒక్క మంచి పనితో అందరి నుండి మంచి మార్కులు కొట్టావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: