రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఫైటర్. పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. అయితే సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఫైటర్ కథ ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఆ కథ ఏంటంటే.. బాక్సర్ గా తనకంటూ ఒక గోల్ ఉన్న హీరో ఒక మాఫియా డాన్ కొడుకట. వాళ్ళ నాన్న చేస్తున్న పనులేవీ అతనికి నచ్చవట. 


అయితే ఆ డాన్ కింద మనుషులకు హీరోకి అసలు పడదట. వాళ్ళను టార్గెట్ చేస్తూ హీరో స్కెచ్ వేస్తాడట. డాన్ కొడుకని ఇన్నాళ్లు వదిలిపెట్టగా వాళ్ళు కూడా హీరోని టార్గెట్ చేస్తారట. ఇదే ఫైటర్ కథ అని అంటున్నారు. సినిమాలో బాలీవుడ్ మోడల్ కమ్ క్రేజీ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించడం కూడా సినిమాకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ రెండు సినిమాలు ప్లాప్ అవడంతో పూరి సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. 


సినిమా ఒకవేళ తేడా కొడితే మాత్రం విజయ్ కెరియర్ కచ్చితంగా రిస్క్ లో పడినట్టే అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన పూరి విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో చూడాలి. పూరి మార్క్ ఎంటర్టైనర్ గా క్లాస్, మాస్ ఆడియెన్స్ ను అలరించేలా ఈ మూవీ వస్తుంది. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: