సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అక్కినేని ఇంటి కోడలిగా హ్యాపీగా ఉంది. నాగ చైతన్యతో ఏమాయ చేసావే సినిమా చేసిన సమంతసినిమా నుండి చైతూని ఇష్టపడుతూ వచ్చింది. ఫైనల్ గా ఇద్దరు కలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సీక్రెట్ గా తతంగం నడిపించి ఫైనల్ గా ఎంగేజ్మెంట్ పెళ్లితో షాక్ ఇచ్చారు వీళ్లిద్దరు. అయితే చైతు ప్రేమకు ముందు సమంత లవర్ బోయ్ సిద్ధార్థ్ ప్రేమలో పడ్డది. సిద్ధార్థ్ తో జబర్దస్త్ సినిమా చేసిన సమంత అతనికి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. 

 

ఇద్దరు కలిసి శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేయించారు. నేడో రేపో ఇద్దరు పెళ్లి అంటూ వార్తలు రాగా సడెన్ గా ఏమైందో ఏమో సమంత సిద్ధార్థ్ నుండి దూరమయ్యింది.అంతేకాదు సిద్ధార్థ్ తో లవ్ మ్యాటర్ గురించి అడిగితె తన జీవితం కూడా మహానటి సావిత్రిలా మారేదని ఆ ,మధ్య ఇంటర్వూస్ లో చెప్పింది సమంత. తనకు పెళ్ళైన విషయాన్ని దాచి సమంతని సిద్ధార్థ్ లైన్ లో పెట్టాడా.. ఎందుకు సమంత సిద్ధార్థ్ నుండి దూరమవడం తన అదృష్టంగా భావిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక సిద్ధార్థ్ కు బై చెప్పి చైతూతో లవ్ ట్రాక్ కొనసాగించిన సామ్ ఫైనల్ గా అతన్ని పెళ్లాడింది. 

 

సిద్దార్థ్ తో పూజల వరకు వెళ్లిన సమంత అసలు మళ్ళీ అతని గురించి ఏం తెలిసి వెనక్కి తగ్గిందో తెలియలేదు. చైతుతో పెళ్లి తర్వాత చైతు లాంటి భర్త దొరకడం తన అదృష్టం అంటుంది సమంత. పెళ్లి తర్వాత కూడా అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఈమధ్యనే జాను ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత తర్వాత తెలుగు సినిమా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.           

మరింత సమాచారం తెలుసుకోండి: