మెగాస్టార్ చిరంజీవి నిన్న తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న చిరంజీవిసినిమా తరువాత స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో నటిస్తాడని ఆయన అభిమానులు భావించారు. కానీ చిరంజీవి మాత్రం రొటీన్ సినిమాలు తీసే దర్శకులు, ఫ్లాప్ దర్శకులను ఎంచుకోవడంతో ఆయన అభిమానులు నిరాశ పడుతున్నారు. ఫామ్ లో లేని దర్శకులకు చిరంజీవి ఎందుకు అవకాశం ఇచ్చారో అర్థం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు. 
 
ఆచార్య తర్వాత చిరంజీవి సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమా తరువాత పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా శక్తి ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ ముగ్గురు దర్శకుల చివరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్, యావరేజ్ అనిపించుకున్నాయి. సుజీత్ సాహో సినిమాతో ప్రభాస్ అభిమానులను, ఇతర హీరోల అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. 
 
బాబీ దర్శకత్వం వహించిన వెంకీ మామ రొటీన్ సినిమా అని పేరు తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ అనిపించుకుంది. ఇకపోతే షాడో సినిమా తరువాత మెహర్ రమేష్ కు అవకాశం ఇచ్చే హీరోలే కరువయ్యారు. చిరంజీవి తలుచుకుంటే త్రివిక్రమ్, సుకుమార్, హరీష్ శంకర్, ఇతర డైరెక్టర్లు సిద్ధంగా ఉంటారు. కానీ చిరంజీవి ఫామ్ లో లేని దర్శకుల పేర్లు ప్రకటించడంతో స్టార్ డైరెక్టర్లు చిరంజీవిని దూరం పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్లు యంగ్ హీరోలతో వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉండటం వల్లే చిరంజీవిని దూరం పెడుతున్నారని తెలుస్తోంది. 

 

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ఈ సినిమాతో చిరంజీవికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: