వెండితెరపై అద్భుతంగా ప్రేమకథల్లో నటించిన మన తారలు కూడా ప్రేమలో పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ సినిమాల్లోనే సుఖాంతమవుతుంది. నిజ జీవితంలో కాదు అంటుంటారు. కానీ రియల్ లైఫ్‌లోనూ.. రీల్ లైఫ్‌లోనూ ప్రేమను సుఖాంతం చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ఇక తెలుగు పరిశ్రమలో ప్రేమలో పడి దాన్ని పెళ్లితో సాకారం చేసుకున్న స్టార్స్ చాలామందే ఉన్నారు. వారిలో మొదటగా చెప్పుకోవలసింది నా టితరం సూపర్‌స్టార్స్ కృష్ణ- విజయనిర్మల. ఆ తరువాత ప్రముఖ నటుడు నాగార్జున-అమల మహేష్- నమ్రత నుండి లేటెస్టుగా పెళ్లిచేసుకున్న సమంత-నాగచైతన్యల వరకూ అందరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నవారే. ప్ర‌స్తుతం మ‌నం ఇక్క‌డ నాగార్జున అమ‌ల‌ల ప్రేమ గురించి మాట్లాడుకుందాం...

 

టాలీవుడ్ కింగ్ నాగార్జున... మన్మథుడిగా అమ్మాయిల మనసు దోచే హీరోగా ఇప్పటికీ అదే ఇమేజ్‌ని ఫాలో అవుతున్నాడు. కాని ఆయన మనసు దోచింది మాత్రం అమల. హీరోయిన్‌గా మూడు నాలుగు సినిమాల్లో నటించిన అమలతో నాగార్జున శివ సినిమాతోనే ప్రేమలో పడ్డాడు. అప్పటికే కిరాయిదాదా, చినబాబు వంటి చిత్రాల్లో కలిసి నటించిన నాగార్జున, అమల ఈ సినిమాలోనూ జంటగా నటిస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి పరిచయం వున్నప్పటికీ వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచింది మాత్రం ఈ సినిమా షూటింగేనట. 

 

ఆ సాన్నిహిత్యమే ప్రేమగా మారింది. అనంతరం మూడేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట 1992లో పెళ్లి చేసుకుని ఒక్కటైంది. ఇక వీరిద్దరి మధ్య వున్న అన్యోన్యత మాత్రం ఇప్పటి తరాలకు ఆదర్శం అని చెప్పాలి. నాగార్జునను పెళ్లిచేసుకున్న అమల సినిమాలకు గుడ్‌బై చెప్పి రెడ్‌క్రాస్ వ్యవహారాల్లో బిజీగా మారింది. ఇక అక్కినేని కుటుంబంలో దాదాపు మరో పాతికేళ్ల తరువాత మొదలైన రెండో ప్రేమకథ నాగచైతన్య-సమంతలదే అని చెప్పాలి. ఏ మాయ చేసావే చిత్రంతో హీరోయిన్‌గా సినీ పరిశ్రమకు పరిచయం అయిన సమంత ఆ సినిమాతో చైతూని నిజంగానే మాయ చేసింది. సామ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన చైతూ ఆ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఈ గ్యాప్‌లోనే చైతూతో కలిసి నటించిన ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు చైతూ-సమంతలని దగ్గర చేశాయి. అలా మొదలైన వీళ్ల ప్రేమ పెళ్లితో సుఖాంతం అయింది. వీరిద్ద‌రూ కూడా ఇన్‌స్పిరేష‌న్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: