కరోనా ప్రభావంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది  సినిమాల బడ్జెట్ కుదించాల్సిన  పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈపరిస్థితులలో హీరోలు దర్శకులు టాప్ టెక్నీషియన్స్ పారితోషికాల తగ్గించు కోవలసిన పరిస్థితిలు ఏర్పడ్డాయి దీనితో ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి టెక్నీషియన్  ఈ కరోనా వేళ నిర్మాతల్ని అర్థంచేసుకుని తగ్గాల్సిన పరిస్థితి ఉందని అంచనాలు ఏర్పడడమే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా సినిమాల విషయంలో అమాంతం కాస్ట్ కటింగ్ తప్పదనే పరిస్థితి ఏర్పడింది.


రాజమౌళి దానయ్య దిల్ రాజు డి. సురేష్ బాబు యూవీ వంశీ ప్రమోద్ మైత్రీ మూవీస్ నిర్మాత రాథాకృష్ణలతో సహా ప్రముఖులంతా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల కాస్ట్ కటింగ్ మ్యాటర్స్ ని చాలలోతుగా ఆలోచనలు చేస్తున్నారు. ఇన్నాళ్లు పారితోషికాలు ఏరియా హక్కులు లాభాల్లో వాటాలు అంటూ  బాగా దండుకున్న హీరోలు దర్శకులు  ఇప్పడు తమ పద్ధతి మార్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీ ప్రముఖులు అంతర్గతంగా చర్చించుకోవడం సాధారణమైన విషయం. అయితే ఈమధ్య  కొందరు  టాప్ హీరోలు  మీడియం రేంజ్ హీరోలు సీక్రెట్ గా ఒక కాన్ఫరెన్స్ కాల్ లో ఈ లాక్ డౌన్ సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  లేటెస్ట్ గా జరిగిన కాన్ఫరెన్స్ కాల్ లో ఒకమెయిన్ అజెండా ఉంది అని అంటున్నారు. 


తెలుస్తున్న సమాచారం మేరకకు హీరోలు అంతా సొంతంగా సినిమా నిర్మాణాలు చేపట్టి ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు అమ్మడం తమకు తామే తమ సినిమాలను విడుదల చేసుకోవడం అనేవిషయాల పై లోతైన చర్చలు జరిగినట్లు సమాచారం. కరోనా క్రైసిస్ కారణంగా కనీసం ఏడాది పాటు  తెలుగుసినిమా ఇండస్ట్రీ కోలుకునేలా కనిపించడంలేదని అభిప్రాయాలు  వ్యక్తం అవుతున్నాయి. థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో 75శాతం  కోత పడనుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈలోటుని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కొంతమేర భర్తీ చేస్తాయి. అందుకే హీరోలంతా నిర్మాతల్ని పక్కన పెట్టాలని వారి చెప్పుచేతలలో నడుచుకునే నమ్మకస్తుల్ని నిర్మాతలుగా మార్చి తామే సినిమాలను తీయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 


ప్రస్తుత తరం హీరోలంటే దృష్టిలో నిర్మాతలంటే కేవలం సినిమా డిస్ట్రిబ్యూషన్ థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాలకు మాత్రమే పనికివస్తారనే అభిప్రాయం ఉండటంతో రానున్నరోజులలో ఎలాగూ థియేట్రికల్ బిజినెస్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ చేయాలంటే ఎవరైనా చేస్తారు కాబట్టి ఎవర్ని అయినా నిర్మాతలుగా మార్చవచ్చని చాలామంది హీరోలు ప్రస్తుతం భావిస్తున్నట్లు టాక్. జరుగుతున్న ఈపరిణామాలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ దృష్టి వరకు రావడంతో వారు అంతా షాక్ అవ్వడమే కాకుండా హీరోల వ్యూహాలకు చెక్ పెట్టె కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: