బాలీవుడ్ స్టార్ కపుల్‌ షారూఖ్‌ ఖాన్, గౌరీల పెళ్లి జరిగి 30 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తరువాత కూడా బాలీవుడ్‌ లో అందరినీ ఆకర్షిస్తున్న ఆకట్టుకుంటున్న బాలీవుడ్‌ కపుల్ వీళ్లే. ఈ జంట తొలిసారిగా 1984లో కలుసుకున్నారు. అప్పుడు గౌరీ కేవలం 18 సంవత్సరాలే. తొలిసారిగా ఈ జంట ఢిల్లీలోని పంచశీల క్లబ్ లో కలిశారట. తొలి సారి బయటకు వెళ్లినప్పుడు స్విమింగ్ పూల్‌ పక్కన కూర్చొని కోలా తాగుతూ మాట్లాడుకున్నట్టుగా షారూఖ్‌ బయోగ్రాఫిలో వివరించారు.

 

అయితే వీళ్లు చాలా కాలం పాటు వీళ్ల ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచారు. అప్పటికి షారూఖ్‌ ఆర్థికంగా సెటిల్ కాకపోవటంతో సెటిల్ అయ్యే వరకు ఎదురుచూశారు. దాదాపు 7 ఏళ్ల ప్రేమ తరువాత 1991లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ల పెళ్లి అంత ఈజీగా ఏం జరగలేదు. గౌరీ కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అంగకీరించకపోవటంతో ఆమె షారూఖ్‌ కూడా చెప్పుకుండా ఇంట్లోనుంచి వచ్చేసింది. డైరెక్ట్‌గా ఢిల్లీ నుంచి ముంబైలోని షారూఖ్‌ దగ్గరకు వచ్చేసింది.

 

ఆ సమయంలో కేవలం 10000 మాత్రమే చేతిలో ఉన్న షారూక్, ఆ డబ్బుతోనే ఓ ఇళ్లు తీసుకొని గౌరీని వివాహం చేసుకున్నాడు. కొత్త డ్రెస్‌ కొనేందుకు డబ్బులు సరిపోకపోవటంతో అక్టోబర్ 25న జరిగిన వివాహానికి ఓ సినిమా కాస్ట్యూమర్‌ నుంచి సూట్‌ను అద్దెకు తీసుకొని పెళ్లి చేసుకున్నాడు కింగ్ ఖాన్‌. ఆ సమయంలో షారూఖ్ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాడు. అయితే షారూఖ్‌ కెరీర్‌ తొలి నాళ్లలో గౌరీ ఓ విషయం చాలా గట్టిగా చెప్పిందట. ఒక వేళ సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, సక్సెస్‌ కాలేకపోయినా వెంటనే ఢిల్లీ వెళ్లిపోదామని చెప్పిందట గౌరీ.

 

అయితే అదృష్ట వశాత్తు షారూఖ్ సక్సెస్ కావటం మాత్రమే కాదు బాలీవుడ్ కింగ్ ఖాన్‌గా ఎదిగాడు. దీంతో డౌరీకి కూడా సినిమాల పట్ల మక్కువ ఏర్పడింది. సినిమాల ఎంపికలో షారూఖ్‌కు సాయం చేసేది. షారూఖ్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించిన తరువాత ఆ బాధ్యతలు కూడా తానే చూస్తుంది గౌరి.

మరింత సమాచారం తెలుసుకోండి: