టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన ప్రేమ వ్యవహారాల్లో జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డి ప్రేమ వ్యవహారం ఒకటి. వీళ్ళు ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించడం వీరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం అప్పుడు మీడియా తో పాటుగా టాలీవుడ్ లో కూడా ఎక్కువగా వచ్చాయి. దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా సరే జనం మాత్రం అప్పుడు ఎక్కువగా దీనిపై వార్తలు వస్తూ ఉండేవి. నరసింహుడు, అశోక్ సినిమాల్లో ఆమెతో డ్రెస్ లు మాత్రమే వేయించాడు అని ఆమె స్కిన్ షో చేయకుండా జాగ్రత్త పడ్డాడు అని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

 

అసలు ఇది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా సరే పదే పదే అప్పట్లో కథనాలు వచ్చేవి. వీరు పెళ్లి చేసుకోవడానికి సమీరా రెడ్డి కుటుంబం ఓకే చెప్పింది అని కాని తర్వాత వీళ్ళు విడిపోయారని దానికి కారణం హరికృష్ణ అని అంటున్నారు. ఆయనకు సినిమా వాళ్ళను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందుకే ఈ పెళ్ళికి అప్పుడు అడ్డం పడ్డారని అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ కూడా దీనిపై జోక్యం చేసుకుని అడ్డుకున్నారు అని అనే వాళ్ళు. 

 

వీళ్ళు పెళ్లిని ఊటి లో చేసుకోవాలని చూసారని కాని అది అప్పుడు సాధ్యం కాలేదని ఎన్టీఆర్ ఆమెను బాగా ప్రేమించాడు అని అన్నారు. ఇక వీళ్ళు కలిసి నటించిన సినిమాలు రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ అప్పట్లో. వీటిపై ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాల తర్వాత మారిపోయాడని కుటుంబం లో ఆ పెళ్లి చేసుకుంటే విభేదాలు వచ్చే అవకాశం ఉందని వెనక్కు తగ్గాడు అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: